మంచి మాట

మాతృప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భూ ప్రపంచంలో ‘మాతృప్రేమ’ను మించినది ఏదీ లేదు. సకల జీవకోటి మాతృగర్భాన ఉదయించవలసిందే. సకల జనావళిని భరించేవి.. మోసేది భూమాతయే. అమ్మ నవమాసాలు మోసి మనకు జన్మనిస్తుంది. పాలు ఇచ్చి పెద్దవాళ్లను చేస్తుంది. అడుగులు వేయడం నేర్పుతూనే నడక నేర్పుతుంది. ప్రతి ఒక్కరికీ అమ్మే తొలి గురువు. అందుకే అమ్మను మించిన దైవం ఇలలో లేదు. కళ్ళముందు కదలాడే దైవం అమ్మ. బిడ్డ ఎలాంటివాడైనా అమ్మ ప్రేమలో తేడా వుండదు. మంచివాడైనా చెడ్డవాడైనా, దుర్మార్గుడైనా బిడ్డ అలిసి ఇంటికి వస్తే అనురాగంతో కడుపు చూస్తుంది. తను తినకున్నా బిడ్డ కడుపు నింపుతుంది. అదే అమ్మ ప్రేమలో వున్న అనురాగం.
కాని ఈ కలియుగంలో అమ్మ స్థానం మారుతోంది. అందుకు వెలసిన వృద్ధాశ్రమాలే ప్రత్యక్ష నిదర్శనాలు. అందుకు కొంతవరకుతల్లిదండ్రులే కారణమని అనవచ్చు. పిల్లలను బాల్యం నుండే పాశ్చాత్య భాషాభిమానంతో ఇంగ్లీషు చదువులు చదివించి మన అనే తెలుగు భాషను విస్మరిస్తున్నారు. చదివే చదువు వేరైనపుడు అమ్మ నాన్నలే పరాయివారు అవుతున్నారు. పిల్లలను చదువు యంత్రాలుగా మారుస్తున్నారు. ఆ ఒత్తిడిలో ఎందరో పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక చెడునడతకు అలవడుతున్నారు.
యువత తల్చుకుంటే ఏమైనా సాధించగలరు. యువతరానికై వివేకానందుడు బోధించిన బోధనలు ఎంతో ఆచరణీయం. మన ప్రభుత్వం కూడా అన్ని రంగాల్లో యువతకు చేయూతనివ్వాలి. ఇక్కడ చదువు నేర్చుకుని నిపుణులైన వారు విదేశీ మోజుతో మరెక్కడికో పోకుండా మన దేశ అభివృద్ధికై వారు పాటుపడాలి. పరాయి పాలనలో మగ్గిపోయిన మన భారతం అభివృద్ధివైపు పయనించాలంటే యువత నడుము బిగించాలి. ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్న మన భారతం పరిష్కార మార్గాన పయనించాలి. అవినీతిని, అధర్మాన్ని, అన్యాయాలను, అక్రమాల ను కూకటివ్రేళ్ళతో పెకిలించివేయాలి. అపుడే మన భారతం ఈ జగాన దేదీప్యమానంగా వెలుతుంది.
మన భారతాన వున్న సహజవనరులు ఏ దేశాన లేవు. మన సంస్కృతి సంప్రదాయాలను కనుమరుగు కాకుండ మన తెలివి, మన ప్రతిభను ఆసాంతం మన భరతమాతకు అంకితం చేసి ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న పెద్దల మాటలను సదా తలుస్తూ ‘మా దేశ అభివృద్ధే మా అభివృద్ధి’ అని గర్వంగా చెప్పుకొనే దేశ అభివృద్ధికి తోడ్పడాలి. దేశ ఔన్నత్యాన్ని తగ్గట్టుగా వ్యవహరించాలి. ఎందరో పురాణ పురుషులు, పుణ్యపురుషులు జన్మించిన ఈ భారతంలో మనం మానవులుగా పుట్టినందుకు గర్వపడాలి. పూర్వజాతి వైభవాన్నితిరిగి ప్రజ్వలించేలా మన నడతను మార్చుకోవాలి. అంతే కాదు రాబోయే తరానికి ఆదర్శవంతులుగా మిగలాలి. రేపటి బాలలను జాతి గర్వించదగ్గ రీతిలో పెంచాలి. విత్తు ఒకటే వేస్తే వృక్షం వేరొకటి రాదు అన్న నానుడి గుర్తుపెట్టుకుని మన పిల్లలను మనమే జాగ్రత్తగా త్యాగధనులు పుట్టిన ఈ నేల గొప్పతనాన్ని గుర్తించేలా వారిని పెద్ద చేయాలి.
గ్రామాల అభివృద్ధే మన దేశ అభివృద్ధి. కాని నేడు ఎటుచూసినా కాలుష్యం. భగవంతుడు మనకు అన్నీ సమృద్ధిగా ఇస్తాడు. కాని మనం మనం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాం. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని- పంచభూతాలు. వాటిని సర్వం కలుషితం చేసుకున్నాం. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ప్రకృతిని కలుషితం కాకుండా చూసుకోవడానికి నడుం బిగించాలి.
ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తెరిగి మన ప్రకృతిని మన భారతదేశాన్ని కాపాడాలి. దేశం బాగుంటే మనం బాగుంటాము. అదే మనము భగవంతుడికిచ్చే నిజమైన నివాళి. మానవసేవయే మాధవసేవ అన్న నానుడిని సదా తలుస్తూ ఈ జన్మనిచ్చిన తల్లికి, భరతమాత కు సేవ చేసి తరిద్దాం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుదాం.

-కురువ శ్రీనివాసులు