విశాఖ

గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మే 27: 2016-17 విద్యా సంవత్సరంలో గిరిజన విద్యార్థులకు ఇంటర్‌మీడియట్‌లో కార్పోరేట్ విద్యను అందించనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.కమల శుక్రవారం విలేఖరులకు తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో ఏడు లేదా అంతకంటే ఎక్కువ గ్రేడ్ పాయింట్లు సాధించిన గిరిజన విద్యార్థులు కార్పోరేట్ విద్యకు అర్హులని చెప్పారు. గిరిజన విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండు లక్షల రూపాయల ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ప్రవేశానికి 604 సీట్లు కేటాయించగా, జిల్లాల వారీగా ఎన్ని సీట్లు అన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. అందుబాటులో ఉన్న సీట్లలో 60 శాతం బాలికలకు, 40 శాతం బాలురకు కేటాయించనున్నట్టు చెప్పారు. అర్హులైన గిరిజన విద్యార్థులు వచ్చేనెల 2 నుంచి 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, జిల్లాలో ఏ కళాశాలలో సీటు ఎంపిక చేసుకునే సౌలభ్యం కల్పించామని తెలిపారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సీట్లు కేటాయిస్తామని, వచ్చేనెల 20వతేదీన తొలిదశలో ప్రవేశాలు కల్పించనున్నట్టు చెప్పారు. తొలిదశలో ప్రవేశాలలో మిగిలిపోయిన సీట్లను ప్రతిభ ఆధారంగా వచ్చేనెల 23 నుంచి 27వ తేదీ వరకు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.