వరంగల్

ఓరుగల్లు అభివృద్ధిపై సిఎం ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 2: రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ముందుగా ఆయన జాతీయ జెండా ఎగురవేసి ఆ తరువాత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అనంతరం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. 30వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చుపెడుతున్న ఏకైక ప్రభుత్వం మనదేనని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణరాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించి బాసటగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగానికి కావలసిన అర్హత లేని పక్షంలో అర్హత సాధించడానికి ఐదు సంవత్సరాల కాల వ్యవధిని వెసులుబాటు కల్పించి ఈ మేరకు అమరవీరుల కుటుంబాలకు నేడు ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికే 117 అమరవీరుల కుటుంబాలకు 10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేసినట్లు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ దాదాపు కోటి మంది భక్తులు హాజరయ్యే సమ్మక్క - సారలమ్మ జాతరను తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా విజయవంతం చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం జిల్లాలో ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించి పట్టణాభివృద్ధికి దిశానిర్దేశం చేశారని, జిల్లాను టెక్స్‌టైల్, ఇండస్ట్రీయల్, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుటకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 3,600 ఎకరాల భూమిని గుర్తించి పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ నుండి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. లక్ష పవర్‌లూమ్స్‌తో భారీ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకుప్రతిపాదనలు రూపొందించామన్నారు. చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ నగరాన్ని ప్రపంచ వారసత్వ నగరంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందని, హెరిటేజ్, హృదయ్, స్మార్ట్‌సిటీలో చోటు దక్కిందన్నారు. నగర సమగ్రాభివృద్ధికి నూతన మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోనుందని, నగరం చుట్టూ 73 కిలో మీటర్ల ఔటర్‌రింగ్‌రోడ్ నిర్మాణంతో పాటు పట్టణంలోని రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు హంటర్‌రోడ్డు నుండి నాయుడు పంప్ వరకు, ఎన్‌ఐటి నుండి కెయుసి మీదుగా పెద్దమ్మగడ్డ, కడిపికొండ నుండి ఉర్సుతదితర పట్టణ ప్రధాన రోడ్ల అభివృద్ధికి పనులు జరుగుతున్నాయని అన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకొని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ముమ్మరంగా చేపట్టినట్లు వివరించారు. మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీ, హరితహారం, భూకొనుగోలు పథకం, విద్యుత్, విద్యా మరియు ఆరోగ్యం, మహిళా సాధికారత లాంటి పథకాలు అమలుకు నోచుకుంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పిచైర్‌పర్సన్ గద్దల పద్మ, డిఐజి ప్రభాకర్‌రావు, మేయర్ నన్నపనేని నరేందర్, సిపి సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, మహబూబాబాద్ ఎంపి సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ పాల్గొన్నారు.