వరంగల్

బంగారు తెలంగాణలో భాగస్వాములవుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల సందర్భంగా హన్మకొండలోని జె ఎన్ ఎస్ గ్రౌండ్‌లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి జ్యోతిప్రజ్వాలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేసిందన్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ మొదటి దశలో 415.83 కోట్ల రూపాయల నిధులతో 1075 చెరువుల పునరుద్ధరణ చేపట్టి 888 చెరువు పనులు పరిపూర్ణంగా పూర్తి చేశామన్నారు. రెండవ దశ పనుల్లో భాగంగా జిల్లాలో 404.89 కోట్ల రూపాయల నిధులతో 1082 చెరువులకు పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో జిల్లాలో 50 మండలాల్లో 34.05 శివారు గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించేందుకు 4,433 కోట్ల రూపాయలతో ఐదు సెగ్మెంట్లుగా పథకాన్ని మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా మొదటి సెగ్మెంట్‌లో మూడు నియోజకవర్గాలైన జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తిలో గల 11 మండలాల్లోని 704 శివారు గ్రామాలకు ఈ ఏడాది జులై 31వ తేదీ లోపు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటి సరఫరా అందిస్తామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, మేయర్ నన్నపనేని నరేందర్, జెడ్పిచైర్‌పర్సన్ గద్దల పద్మ, సిపి సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, ఎంపి సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.