వరంగల్

దళితులను నమ్మించి దగా చేసిన కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని గురువారం హన్మకొండలో ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 10 గంటలకే అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. అంతకుముందే పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, నిరసన చేసుకునేందుకు వారికి ఉదయం 11:30 గంటలకు అనుమతి దొరికింది. దీంతో సరిగ్గా 11:30గంటలకు మందకృష్ణ మాదిగ అక్కడకు చేరుకొని వారి కార్యకర్తలతో కలిసి విగ్రహం వద్దకు నిరసన ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ తొలి సిఎం దళితుడేనని చెప్పి నమ్మించి మోసం చేశాడని అన్నారు. టిఆర్‌ఎస్ నాయకత్వంలో దొరలు, వారి బానిసలు మాత్రమే తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరుపుకుంటున్నారే తప్ప ఆయనతో మోసానికి గురైన వారెవ్వరూ సంబరాల్లో పాల్గొన సరికదా వారిపై తిరుగుబాటే చేస్తారన్నారు. దళితులకు మూడెకరాల భూమి అన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంత వరకు ఏ ఒక్కరికి కూడా అందజేయలేదన్నారు. డబుల్‌బెడ్‌రూం పథకం కూడా పునాధి దాటలేదన్నారు. అంబేద్కర్‌కు తెలంగాణ సమాజం రుణపడి ఉందన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ ఒక్కరు కూడా ఉత్సవాల సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయలేదన్నారు. అంబేద్కర్ 125 ఫీట్ల ఎత్తయిన విగ్రహం మాటున ముఖ్యమంత్రి కెసిఆర్ మోసాలు దాగి ఉన్నాయని తెలిపారు.
సిఎం కెసిఆర్ తన మోసాలు కప్పిపుచ్చుకునేందుకే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడని అన్నారు. ముస్లీం, గిరిజన రిజర్వేషన్లు అడ్రస్సు లేకుండా పోయాయన్నారు. అనంతరం సిఎం కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ నాయకులు తిప్పారపు లక్ష్మణ్, మందకుమార్, పుట్ట రవి పాల్గొన్నారు.