వరంగల్
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 2 June 2016
ఆత్మకూరు, జూన్ 2: అప్పుల బాధలు తాళలేక రైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆత్మకూరు మండలంలోని దామెర గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మృతుని బంధువుల కథనం ప్రకారం దామెర గ్రామానికి చెందిన నడిగట్టు కొమురయ్య (65) తన నాలుగెకరాల భూమిని అప్పులు చేసి సాగు చేశాడు. ఆశినంత దిగుబడి రాక అప్పులు ఇటీవల అధికం కావడంతో అవి ఎలా తీర్చాలోతోచక తీవ్ర మనస్తాపానికి గురైన కొమురయ్య గురువారం తెల్లవారుఝామున ఇంట్లో క్రిమిసంహారక మందును తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డాడు. మృతుని బంధువులు గమనించి చికిత్స కోసం ఎంజి ఎంకు తరలిస్తుండగా కొమురయ్య మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య లక్ష్మి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.