శ్రీకాకుళం

ఆటోలకు జిపిఎస్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూన్ 2: జిల్లాలో నేర తీవ్రత కంటే ట్రాఫిక్ అత్యంత దారుణంగా ఉందని జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి అన్నారు. స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్ రికార్డుల పరిశీలనకు గురువారం ఆయన విచ్చేసిన సందర్భాన్ని విలేఖర్లతో మాట్లాడారు. జాతీయ రహదారిపై వాహనాలు అత్యంత వేగంగా వెల్తుండటాన్ని నియంత్రించాల్సి ఉందని, దీనికై రోడ్డుపక్కన ఇనుప స్టాపర్స్ కాకుండా ప్లాస్టిక్ స్టాపర్‌లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే ఆటోలకు పోలీసుస్టేషన్ల రిజిస్ట్రేషను తప్పనిసరని, అయితే చాలా ఆటోలకు పోలీసు స్టేషన్ రిజిస్ట్రేషన్ లేకపోవడం విచారకరమన్నారు. పైగా ఆటోల్లో సుమారు 15 నుంచి 20 మంది వరకు ప్రయాణికులను ఎక్కించుకు వెళ్తున్నారని, అటువంటి వాటిపై దృష్టిసారించి కేసులు నమోదు చేస్తామన్నారు. పైగా ఆటోల్లో జిపిఎస్ విధానం అమలకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, అది అమలైతే ఆటో ఎవరు నడుపుతున్నారు? ఆటోల్లో ఎవరెవరు ఉన్నారన్నది తెలుసుకునే వీలుంటుందన్నారు. తాను పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసు స్టేషన్ల తనిఖీల్లో అత్యధికంగా పట్టుబడ్డ వాహనాలు ఉండటం గమనించానని, వీటిని రవాణా శాఖ అధికారుల అనుమతితో వేలం వేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న వర్షాకాలం సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం విరివిగా చేపట్టాలని ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. నగరంలో సిగ్నల్ వ్యవస్థ మెరుగుపర్చేందుకు ముఖ్యమైన కూడల్లో సిగ్నల్ లైట్ల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ అనుమతి మంజూరు చేసినందున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఆయనతో పాటు డిఎస్పీ కె.్భర్గవరావు నాయుడు, సిఐ డి.మోహనరావు, ఎస్‌ఐ కుమార్ పాల్గొన్నారు.