తూర్పుగోదావరి

పేదరికం లేని సమాజమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 2: పేదరికం లేని సమాజమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని బాలాజీ చెరువు జంక్షన్‌లో గురువారం నవ నిర్మాణ దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దీక్షకు ముందు కలెక్టర్ కార్యాలయం నుండి బాలాజీ చెరువు జంక్షన్ వరకు నవ నిర్మాణ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. బహిరంగ సభకు హాజరైన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ద్వితీయ నవ నిర్మాణ దీక్షను నేడు జరుపుకుంటున్నామని, విభజన అనంతరం అనేక సవాళ్ళను రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారన్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చినరాజప్ప చెప్పారు.
కాకినాడ ఎంపి తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర విభజన కారణంగా మనకు అనేక కష్టాలు వచ్చాయని, సచివాలయం, అసెంబ్లీ లేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఇటువంటి స్థితిలో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న విషయమై ముఖ్యమంత్రి నిరంతరాయంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోరాదన్న నినాదంతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించామని, అదే స్ఫూర్తితో రాష్ట్భ్రావృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోవడంతో గత రెండేళ్ళుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అభివృద్ధి, ఆదాయం అంతా హైదరాబాద్ కేంద్రంగా ఒకవైపే ఉండిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితులను అధిగమించి, మరలా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకుతీసుకువెళ్ళే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం మనం నడిరోడ్డుపై ఉన్నామని, రాజధాని నిర్మాణానికై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి మనమంతా సహకరించాల్సి ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కాకినాడ నగర శాసన సభ్యుడు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 5 కోట్ల మందికి అమరావతి పేరుతో రాజధానిని నిర్మిస్తుంటే, ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆర్ధిక ఇబ్బందులున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. అంతకు ముందు ఉదయం 11 గంటలకు విజయవాడ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ముఖ్యమంత్రి ప్రజలతో నవ నిర్మాణ దీక్ష చేయించారు. కార్యక్రమంలో కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ ఎస్ అలీం బాషా, ఉద్యోగ జెఎసి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి, డాక్టర్ పి చిరంజీవినికుమారి, కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దంటు సూర్యారావు, వివిధ శాఖల అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.