తూర్పుగోదావరి

కేంద్ర సాయం తక్కువే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 2: రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం తక్కువగానే ఉందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలని కోరారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా స్థానిక పుష్కరాలరేవు వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విభజన సందర్భంగా ఎపికి సరైన న్యాయం చేయకపోవడం వల్లే యుపిఏ ప్రభుత్వం డిపాజిట్లు కోల్పోయిందని గుర్తుచేశారు. రాష్ట్భ్రావృద్ధికి మహాసంకల్పంతో దీక్ష చేపట్టి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజలంతా సహకరించి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పెన్షన్లు, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారన్నారు. కమిషనర్ వి విజయరామరాజు మాట్లాడుతూ శుక్రవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు ఆనంకళాకేంద్రంలో రాష్ట్రప్రగతిపై నివేదికలు, చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా ఈకార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. మేయర్ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ విభజన వల్ల నష్టపోయినా కొత్త పంథాతో రాష్ట్భ్రావృద్ధిని చంద్రబాబు ముందుకు తీసుకెళుతున్నారన్నారు. ఈసందర్భంగా విజయవాడ బెంజ్‌సర్కిల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీగా ప్రజలు నవ నిర్మాణ దీక్షా కార్యక్రమానికి తరలివచ్చారు. ఈకార్యక్రమంలో ఎస్పీ బి విజయకుమారి, డిప్యుటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
అడ్డగోలుగా విభజించారు
కనీసం రాజధాని కూడా లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ మండలం మోరంపూడి జంక్షన్‌లో జరిగిన నవనిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ విభజన వల్ల ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తోందన్నారు. తొలుత రూరల్ ఎంపిడిఓ కార్యాలయం నుంచి మోరంపూడి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ బి రాజకుమారి, పంచాయితీ అధికారి వరప్రసాద్, ఎంపిడిఓ రమణారెడ్డి, తహశీల్దార్లు జి భీమారావు, రామోజీ, జెడ్పీటిసి పాలపర్తి సరోజ పాల్గొన్నారు.