అదిలాబాద్

మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలమడుగు, జూన్ 3: మహిళలు స్వయం ఉపాధిలో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాలు కృషి చేస్తోందని, అందులో భాగంగానే రాయితీపై నిధులను అందిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రుయ్యాడి గ్రామంలో 21 డ్వాక్రా గ్రూప్ మహిళలకు రూ.10లక్షల 50వేల రుణాలను అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేనంత పెద్ద మొత్తంలో రుణాలను తెరాస ప్రభుత్వం అందిస్తూ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కృషి చేస్తోందని అన్నారు. రాయితీపై పొందిన రుణాలను ఇంటి అవసరాలకు వినియోగించుకోకుండా ప్రణాళిక బద్దంగా స్వయం ఉపాధి పొందినట్లయితే ఆర్థికంగా ఎదగవచ్చని అన్నారు. అదే విధంగా మహిళలు రుణాలపై తీసుకున్న డబ్బులను చెల్లించడంలో నిర్లక్ష్యం వహించరాదని, సకాలంలో చెల్లించినట్లయితే తిరిగి పెద్దమొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీ ఆర్ ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, బ్రాంచ్ మేనేజర్ కోసేరావ్, సుంకిడి సర్పంచ్ గోదావరి వెంకన్న, టీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షురాలు మహేందర్ యాదవ్, ఆశన్న, మాదవ్ పాల్గొన్నారు.