అదిలాబాద్

మినీ ట్యాంక్‌బండ్‌గా ధర్మసాగర్ చెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూన్ 3: ఎట్టకేలకు నిర్మల్ పట్టణ వాసుల ‘కల’ నెరవేరనుంది. పట్టణ నడి ఒడ్డున బస్టాండ్‌కు అత్యంత సమీపంలోనే ఉన్న ధర్మసాగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. ఈ చెరువులో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ది చేసేందుకు రూ.17 కోట్లతో తయారుచేసిన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం ఈ పనులను ఆమోదించగానే టెండర్లు నిర్వహిస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. చెరువులో బోటింగ్ పాయింట్‌తోపాటు పార్కు, కట్ట వెడల్పు పనులను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మార్నింగ్ వాక్ కోసం చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటుచేయడంతోపాటు ఇతర అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
2008 నుంచే అభివృద్ధి
పట్టణంలోని బస్టాండ్ సమీపంలోనే ఉన్న ధర్మసాగర్ చెరువును 2008 నుంచే అభివృద్ధి చేయడం ప్రారంభించారు. అప్పట్లోనే మినీ ట్యాంక్‌బండ్‌గా నామకరణంచేసి మున్సిపాలిటి ఆధ్వర్యంలో రూ.35 లక్షల నిధులను వెచ్చించారు. ఈ నిధులతో జాతీయ రహదారి నుండి చెరువు కట్టపైకి వెళ్లేందుకు సిసి రోడ్డును నిర్మించారు. అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్ సైతం ఏర్పాటుచేసి చెరువు ఓడ్డున పచ్చగడ్డిని పెంచారు. అనంతరం రెండేళ్ల తర్వాత రాజీవ్‌నగర బాట కింద రూ.60 లక్షలు విడుదల కావడంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులతోపాటు మరిన్ని అభివృద్ది పనులు పూర్తిచేశారు. ప్రస్తుతం ఆయా పనులపై నిర్వహణ లేనికారణంగా ఆనవాళ్లు కోల్పోయాయి. కాగా పర్యాటకశాఖ నుండి కూడా రూ.72 లక్షలు మంజూరైనప్పటికి గత మూడేళ్లుగా నయాపైసా ఖర్చుచేయలేదు. నిర్మల్‌లో పార్కు లేకపోవడంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు. దీంతో నిర్మల్‌లో మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటుకోసం అవసరమైన నిధులు మంజూరుచేయాలంటూ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావును కోరగా వెంటనే నిధులు విడుదల చేస్తామని హామీనిచ్చారు. దీంతో నీటి పారుదలశాఖ అధికారులు మినీ ట్యాంక్ బండ్ అభివృద్దికి అవసరమైన నిధుల కోసం ఫ్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీటికి తొందరలోనే ఆమోదం లభించి పనులు ప్రారంభమవుతాయని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు.