విజయవాడ

జగన్ దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 3: వైయస్ జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నంలో 8వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం సాయంత్రం రమేష్ ఆసుపత్రి కూడలి సెంటర్‌లో జాస్తి సాంబశివరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నానికి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా కార్పొరేటర్ జాస్తి బొమ్మను వాటేసుకున్నారు. ముందుగానే కార్యకర్తలు బొమ్మపై పెట్రోల్ పోశారు. ఈహడావుడిలో కార్యకర్తలు బొమ్మకు నిప్పుపెట్టటంతో వాటేసుకున్న కార్పొరేటర్‌కు తీవ్రమైన గాయాలైయ్యారు. తేరుకున్న కార్యకర్తలు వెంటనే కార్పొరేటర్‌కు అంటుకున్న నిప్పులను ఆర్పే ప్రయత్నం చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈకార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ దేవినేని అపర్ణ, పార్టీ నగర కార్యదర్శి గనే్న వెంకటనారాయణప్రసాద్, దేశం నాయకులు దుర్గాప్రసాద్, డి నాగేశ్వరావు, నాగమణి, బి రమేష్, డి హరి,పాల్గొన్నారు. కాగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్పొరేటర్ జాస్తి సాంబశివరావును శాసన సభ్యుడు గద్దె రామోహనరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, వియంసి ఫ్పోర్ లీడర్ గుండారపుహరిబాబు, కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, నజీర్ హుస్సేన్, అల్లు వెంకట జయలక్ష్మీ, సుకాశి సరిత, యేదుపాటి రామయ్య, కె దుర్గ్భావానీ, కొండపల్లి అనసూయ, వైకాపా కార్పోరేటరులు చందన సురేష్, బొప్పన భవనకుమార్, కావటి దామోదర్, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు పరామర్శించారు.