విజయవాడ

ప్రయాణికులకు వినోదాల విందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జూన్ 3: ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తుందని ప్రయాణికులు ఏ విషయంలోనూ అసౌకర్యానికి గురి కారాదనే ధ్యేయంతో తాము రాజీలేని నిర్ణయాలు తీసుకున్నామని ఆర్టీసీ మేనేజింగ్ డైరక్టర్ సాంబశివరావు అన్నారు. ఆర్టీసీలో ఇటీవల వచ్చిన విప్లవాత్మక మార్పుల గూర్చి ఈ విలేఖరి అడిగిన పలు ప్రశ్నలకు ఆయన శుక్రవారం సమాధానంగా తమ అభివృద్ధి గూర్చి వివరించారు. రూ.10 కోట్ల వ్యయంతో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కార్పొరేట్ కార్యాలయాలను జూన్ 6న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. ఆసియాలోనే అతి పెద్ద బస్‌స్టేషన్‌గా పేరుగాంచిన విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్‌ని ఆనాడు ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారని ఆయన గౌరవార్ధం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు. రాష్ట్రంలో 423 బస్టాండులు వుండగా వాటిల్లో 103 బస్టాండులను ఆధునీకరించామన్నారు. బస్‌స్టేషన్‌లోకి అడుగుపెట్టిన ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలనే తమ ధ్యేయం నెరవేరుతుందని దానివల్ల ప్రయాణికులు ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌వారు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రయాణికుల పట్ల ప్రత్యేక గౌరవం ప్రదర్శిస్తున్నారు అనే అంశాలను తాము ఎందుకని విస్మరించాలని ఆలోచించామని ప్రైవేట్ ట్రావెల్స్ వారికి బస్టేషన్లు లేవు కానీ ఆర్టీసీకి సువిశాలమైన బస్‌స్టేషన్లున్నాయి వాటిని అభివృద్ధి చేస్తే ప్రయాణికులు ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతారని నమ్మి ఆ దిశగా సౌకర్యాలు కల్పించామన్నారు. పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో చైనా నుండి తెప్పించిన నాలుగు అతి పెద్ద డిజిటల్ స్క్రీన్స్ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ప్రతివారూ బోరు ఫీలవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఆధునిక పరిజ్ఞానం, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. బస్ కోసం వెయిటింగ్ పిరియడ్‌లో వినోదాల విందుని అందుబాటులోకి తెచ్చామన్నారు. మంచినీటి నుండి మరుగుదొడ్ల వరకూ ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు. ఆరునెలల కాలంలోనే తాను ఎన్నో మార్పులు తెచ్చామని ఎండి సాంబశివరావు అన్నారు.
పుష్కరాల ప్రయాణికులకు వినోదాలు పుష్కలం
అత్యంత ఆధునిక సౌకర్యాలతో అమరావతి బస్‌లు 45 సిద్ధంగా వున్నాయని వాటిల్లో ప్రతి సీటుకీ టివి ఉంటుందన్నారు. అలాగే ప్రయాణికులు తమకు నచ్చిన చానల్ ట్యూన్ చేసుకుని నచ్చిన ప్రోగ్రాం చూసుకోవచ్చని ఎండి తెలిపారు. విమానాల్లో ఇలాంటి టివిలు ఉన్నాగాని వారు ప్రసారం చేసిన కార్యక్రమాలు సిడిలు చూడాల్సిందే కానీ అమరావతి బస్‌ల్లో మాత్రం ప్రయాణికులు తమ ఇష్టం వచ్చిన చానల్స్ చూసుకోవచ్చు. ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న అమరావతి బస్‌లు 45 జూన్ 6 నుండి ప్రయాణికులను అలరించనున్నాయని సాంబశివరావు తెలిపారు.
ఆంధ్రాబ్యాంక్ సిటీ బస్‌పోర్ట్
ఇప్పటివరకూ సిటీబస్ స్టాండుకు కెబిఎన్‌జి సంస్థ ప్రత్యేక హంగులతో అభివృద్ధి చేసిందని అలాంటి ఆధునిక సౌకర్యాన్ని సిటీబస్ పోర్టు నేమింగ్‌రైట్స్‌ని ఆంధ్రాబ్యాంకు చేజిక్కించుకుందని ఎండి తెలిపారు. రెండున్నరేళ్ల కాల పరిమితికి రూ.1.20 కోట్లు వెచ్చించి ఆంధ్రాబ్యాంకు నేమింగ్‌రైట్స్ సొంతం చేసుకుందని ఇక నుండి సిటీ బస్టాండును ఆంధ్రాబ్యాంకు సిటీ బస్‌పోర్టుగా పిలువబడుతుందని ఆయన తెలిపారు. సువిశాలమైన సిటి బస్‌పోర్టులో ప్రయాణికులు బస్‌ల కోసం నిలబడి ఎదురు చూడకూడదు. ప్రతి ఒక్కరూ ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీవారు ఏర్పాటుచేసిన కుర్చీల్లో కూర్చోవాలి. అలాగే సిబ్బంది ప్రతి ఒక్కరిని పలుకరించి ఏ బస్ ఎక్కాలి, ఎక్కడికి వెళ్లాలి వివరాలు అడిగి తెల్సుకుంటారు. ప్రయాణికులు ఎక్కడ కూర్చోవాలో వివరించి బస్ రాగానే తెలియజేస్తారు. ఇలాంటి సౌకర్యాలు ఆంధ్రాబ్యాంకు సిటీ బస్‌పోర్టులో ఉంటాయి.