శ్రీకాకుళం

హైర్ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది పర్యవేక్షణ ఉండాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూన్ 3: రాష్టవ్య్రాప్తంగా ఉన్న అద్దెబస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది పర్యవేక్షణతో నిమిత్తం లేకుండా ప్రైవేట్ వారిపై ఆధారపడటం ద్వారా జవాబుదారీ తనం లేకుండా పోతుందని ఎపిఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ ఆర్.వి.ఇ.ఎస్.డి.ప్రసాదరావు హెచ్చరించారు. శుక్రవారం ఈ మేరకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు ఆవరణలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైర్ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వలన ఆదాయం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని, అక్రమ రవాణాకు ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో సంస్థ ప్రతిష్ఠ పాడైపోతుందన్నారు. అదే ఆర్టీసీ సిబ్బంది పర్యవేక్షణలో ఉంటే సంస్థ నియమనిబంధనలకు లోబడి సిబ్బంది పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనిపై తాము రాష్టవ్య్రాప్త గుర్తింపు చేపట్టిన తరువాత మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకువెల్లగా ఆయన సానుకూలంగా స్పందించినా, కొంతమంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వత్తిడితో ఈ వ్యవస్థ కొనసాగుతుండటం విచారకరమన్నారు. అలాగే తాము గుర్తింపులోకి వచ్చిన వెంటనే కార్మికుల సమస్యలను 50 శాతం పరిష్కరించగలిగామని, కార్మికులకు ఏరియర్ బకాయిలతో పాటు కార్మికుల పిల్లలకు నాన్ ఐటిఐగా పరిగణించి ఉద్యోగాలు ఇచ్చే విధంగా యాజమాన్యంతో ఒప్పించగలిగామన్నారు. విజయవాడలో తార్నాక స్థాయి ఆసుపత్రి నిర్మాణానికి 6.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు, ఎఎన్‌ఎల్ వ్యవస్థ రద్దుచేసి పార్సిల్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. అన్ని ప్రభుత్వ రవాణా రంగ సంస్థల మాదిరి డీజెల్‌పై టాక్స్ ఎత్తివేయాలని తద్వారా సుమారు 400 కోట్ల రూపాలయ ఆదాయం సంస్థకు చేకూరుతుందన్నారు.
విభజన నేపథ్యంలో రాష్ట్ర ఆర్టీసీకి 6000 కోట్ల రూపాయల అప్పులు పంచిపెట్టారని, ఇదే నిష్పత్తిలో ఆస్తులు కూడా పంచిపెట్టాలని డిమాండ్ చేసారు. దీంతో 24వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరడం ద్వారా నష్టాలను అధిగమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ రీజనల్ అధ్యక్షులు బి.ఎస్.రాములు, రాష్ట్ర కార్యదర్శి బి.సూరయ్య, రీజనల్ కార్యదర్శి ఎం.ఎ.రాజు పాల్గొన్నారు.