శ్రీకాకుళం

మహిళా సాధికారతకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా ఈ ఏడాదిలో మూడు రకాల ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు మెప్మా మిషన్ డైరెక్టర్ పి.చినతాతయ్య పేర్కొన్నారు. శుక్రవారం జెడ్‌పి సమావేశ మందిరంలో ఆరు పురపాలక ప్రాంతాలకు చెందిన బిఎం సీలు, ఏడిఎంసీలు, ఇపివోలు, సీవోలు, రిసోర్స్ పర్సన్లతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మహిళా సాధికారతలో భాగంగా ఆదాయ మార్గాలు పెంచడం, ఆరోగ్యంపై తగిన శిక్షణ ఇవ్వడం, మహిళల జీవనానికి భద్రత కల్పించడం వంటి కార్యక్రమాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలో 20 వేలు కుటుంబాలు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. వివిధరకాల వ్యాపారాల ద్వారా మహిళలు జీవనోపాధి పెంచుతామన్నారు. కుట్లు, అల్లికలు, సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకునే విధంగా 30వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మహిళా ఆరోగ్య సమితిలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. చంద్రన్న బీమా పథకం కింద ప్రతీ ఒక్కరూ డ్వాక్రా సభ్యులుగాచేరవచ్చునన్నారు. కేవలం రూ.15 సేవారుసుం చెల్లించి 18-70లోపు వయస్సు కలిగిన వారందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. స్వయంసహాయక బృందాలు పారదర్శకంగా పనిచేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతుందన్నారు. జియోట్యాగింగ్, బయోమెట్రిక్, కెమెరాలను ఇప్పటికే వినిగిస్తున్నట్లు వివరించారు. మెప్మా పిడి ఎస్.త్రినాధ్, ఏవో జి.అరుణకుమారి, శ్రీకాకుళం,రాజాం టిపివోలు జగన్మోహనరావు, కామేశ్వరరావు, వెంకటరావు, విజయకుమార్, ఆర్.సత్యనారాయణ, భాస్కరరావు, రమ్యకృష్ణ ఉన్నారు.