తూర్పుగోదావరి

అశాస్ర్తియ విభజన...అధిగమించేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూన్ 3: కొంతమంది స్వార్ధ రాజకీయాలకు లోబడి రెండేళ్ల క్రితం రాష్ట్రాన్ని చాలా అశాస్ర్తియంగా విభజన చేశారని, అందరి భాగస్వామ్యంతో నవ్యాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సామర్లకోట టిటిడిసిలో శుక్రవారం మధ్యాహ్నం అశాస్ర్తియ విభజనపై ప్రత్యేక చర్చాగోష్టి సదస్సు పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేకాధికారి ఆర్డీవో వి విశే్వశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి దేవినేని, రాజప్పలు మాట్లాడుతూ రూ.16వేల కోట్లు లోటుతో ఆస్తులు 20 శాతం, అప్పులు 80 శాతంతో అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారన్నారు. అనేక ప్రతికూల పరిస్థితుల్లో సైతం సిఎం చంద్రబాబు చాకచక్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, నూతన రాజధాని నిర్మాణం, ఎన్నికల హమీల అమలు చేస్తున్నారన్నారు. కాపుల సంక్షేమానికి వేల కోట్ల కేటాయింపు, బోర్డు ఏర్పాటు, కమిషన్ ఏర్పాటు వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. 2018 నాటికి పోలవరం కలను సాకారం చేస్తారన్నారు. అయితే విభజన సమయంలో ఇచ్చిన హమీలకు అనుగుణంగా కేంద్రం నుండి నిధులు, ప్రత్యేక హోదాపై సానుకూలంగా పరిస్థితులు రావడం లేదన్నారు. విశాఖ రైల్వే జోన్ సాధనకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అందరి భాగస్వామ్యంతో నవ్యాంధ్రను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 6వ తేదీ వరకూ నవ నిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. విభజన తీరు తెన్నులు, ఎదురవుతున్న సమస్యలు, రాష్ట్భ్రావృద్ధి, నూతన రాజధాని నిర్మాణం, ఎన్నికల హమీల అమలు తదితర అంశాలపై మంత్రులతోపాటు, ఎమ్మెల్సీ బొడ్డు, ఎంపి తోటలు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బుర్రకథ, ఫొటో ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేశారు. అయితే జలవనరుల శాఖామంత్రి దేవినేని రాక ఆలస్యం కావడంతో చాలామంది మహిళలు వెళ్లిపోయారు. దీంతో ముందు వరుసలో ఖాళీ కుర్చీలు అధికంగా దర్శనమిచ్చాయి. ఈ సదస్సులో జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లు మన్యం పద్మావతిచంద్రరావు, రాజా సూరిబాబురాజు, వైస్ ఛైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ఎంపిపిలు గొడత మార్త, గుడాల రమేష్, వైస్ ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, కార్యదర్శి బడుగు శ్రీకాంత్, ఎఎంసి ఛైర్మన్‌లు పాలకుర్తి శ్రీనుబాబు, ముత్యాల రాజబ్బాయి, మహిళా కౌన్సిలర్ పాగా శిరీషా, తహసీల్దార్ డి సునీల్‌బాబు, ఎంపిడిఒ అడపా వెంకటలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కెటి సుధాకర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు.