తూర్పుగోదావరి

విభజనతో ఉద్యోగులకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, జూన్ 3: రాష్ట్ర విభజనకు ముందు ఉద్యోగస్థులు ప్రమోషన్లు పొందగా, విభజన అనంతరం రివర్షన్లు పొందుతూ నష్టాలను చవిచూడాల్సి వస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నవనిర్మాణ దీక్షా కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన అధికార్ల సమావేశానికి ప్రత్యేకాధికారి పి శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా జెసి సత్యనారాయణ, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జెసి సత్యనారాయణ మాట్లాడుతూ విభజనకు ముందు ఉద్యోగస్థులకు ప్రమోషన్లు సత్వరంగా వచ్చేవని, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రమోషన్లు రాకపోగా ఉన్న హోదా కాస్తపోయి రివర్షన్‌లో హోదా తగ్గుతోందన్నారు. దీనిపై ఉద్యోగస్థులంతా ఐక్యంగా రాష్ట్భ్రావృద్ధిలో పాలుపంచుకొని ప్రగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందని, దీని వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినగా, ఉద్యోగస్థులు కూడా విభజనతో నష్టపోయారన్నారు. విభజనతో జరిగిన నష్టాన్ని ఐక్యంతో అంతా అభివృద్ధికి పాటుపడి రాష్ట్రాన్ని ఆదర్శమైన రాష్ట్రంగా నిలపాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు సత్యానందరావు మాట్లాడుతూ విభజన చేసిన పార్టీ నామరూపాల్లేకుండా పోయిందని, అభివృద్ధి చేసిన పార్టీని ప్రజలు మరువరని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలూ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పయనింప చేస్తున్నారన్నారు. సమావేశంలో ఎఎంసి ఛైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, డిసిసిబి డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపిపిలు, తహసీల్దార్లు, ఎంపిడిఒలు, అధికారులు పాల్గొన్నారు.