తూర్పుగోదావరి

అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే దీక్షల నాటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే నవనిర్మాణ దీక్షల పేరుతో నాటకాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రత్యేకహోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకుండా దీక్షలు నిర్వహించి తన వైఫల్యాలను ప్రజలపై రుద్దుతున్నారన్నారు. కేంద్రంపై రాష్ట్భ్రావృద్ధికి పోరాటం చేయకుండా ప్రతిపక్షాలను విమర్శించటమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. అందరినీ నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలని చెప్పిన చంద్రబాబు కుటుంబ సభ్యులు మాత్రం ఆరోజున ఎక్కడున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జటీవల జరిగిన మహానాడులో సామాజికన్యాయం చేస్తానని చెప్పి రాజ్యసభ సీట్లను ఎవరికిచ్చారో చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇందిరమ్మ ప్రవేశపెట్టిన గరీబీహఠావో నినాదాన్ని వక్రీకరించటంపట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. గడచిన రెండేళ్ళలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రధాన రంగాల్లో విఫలమయ్యాయని వివరించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు 123 మందితో కార్యవర్గాన్ని నియమించినట్లు చెప్పారు. ఉపాధ్యక్షులుగా 28, ప్రధాన కార్యదర్శులుగా 28, కార్యదర్శులుగా 37, సంయుక్త కార్యదర్శులుగా 22, అధికార ప్రతినిధులుగా నలుగురును ఎంపిక చేశారు. వీరంతా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు ఎబివిబి మహేశ్వరరావు, విలియం హ్యేరీ, నురుకుర్తి వెంకటేశ్వరరావు, కె సుధాకరబాబు, పంతం ఇందిర, అయితాబత్తుల సుభాషిణి, రాయుడు రాజవల్లి, గుల్లా ఏడుకొండలు, గెడ్డం సురేష్‌బాబు, బోడపాటి కాంతం, కూనపురెడ్డి రాంబాబు, బాలేపల్లి రాంబాబు, వర్ధనపు వీర్రాజు పాల్గొన్నారు.