సంజీవని

పొలుసుల జబ్బుకు దివ్యౌషధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానసిక, శరీర ఒత్తిడి నేటి నవీన యుగంలో ఎక్కువ కావడంతో ‘సోరియాసిస్’ వంటి చర్మవ్యాధుల బారిన చాలామంది పడుతున్నారు. మొదట్లో చర్మవ్యాధే కదా! అని నిర్లక్ష్యం చేయటం డాక్టర్ సలహా తీసుకోకపోవటం వలన ఈ వ్యాధి మరింత జఠిలమై మానసికంగా బాధిస్తుంది. సోరియాసిస్‌ను నిర్లక్ష్యం చేయకుండా ఆరంభంలోనే హోమియో చికిత్స తీసుకొని ఉపశమనం పొందవచ్చు.
ఈ వ్యాధి ఎక్కువగా ముంజేతి వెనుక భాగం, మోకాలు ముందు భాగం, తల, వీపు, ముఖం, చేతులు, పాదాల దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది.
కారణాలు: కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్ వలన, వంశపారంపర్యంగా, మానసిక ఒత్తిడివలన, చర్మం పొడి బారడాన్ని నిర్లక్ష్యం చేయడంవలన, అధికంగా ఆల్కహాలు, పొగ త్రాగడం, వ్యాధి నిరోధకశక్తి తగ్గి సోరియాసిస్ వస్తుంది.
లక్షణాలు:
* ఈ వ్యాధి సోకిన వారిలో చర్మం పొలుసుల మాదిరిగా రాలిపోతుంది.
* చర్మం దళసరిగా మారడం, నొప్పి రావడం జరుగుతుంది.
* నీటి బుడగల వంటి పొక్కులు వచ్చి నీరు వంటి ద్రవం కారుతూ ఉంటుంది.
* దురద, మంట రాత్రివేళల్లో అధికంగా వుంటుంది.
* కొందరిలో ఎండ తీవ్రత, ఎక్కువగా ఉన్నప్పుడు ‘సోరియాసిస్’ తీవ్రం ఎక్కువగా అనిపిస్తుంది.
* కొందరిలో శీతాకాలంలో చర్మం పొడిబారిపోయి పొలుసులుగా రాలిపోతూ మంట, దురదగా అనిపిస్తుంది.
జాగ్రత్తలు: * ఆల్కహాలు, పొగత్రాగటం, ఫాస్ట్ఫుడ్స్, ఆయిల్‌ఫుడ్స్ తీసుకోవటం మానివేయాలి.
* పౌష్ఠిక ఆహారం తీసుకోవాలి.
* తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా విటమిన్ ‘సి’ ఉన్నవి తీసుకోవాలి.
* వ్యాయామము, యోగ నిత్యం చేస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
* మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. కనీసం రోజుకు నాలుగు లీటర్లు తీసుకోవటంవలన చర్మం పొడిబారకుండా ఉండి, పొలుసులు రాలకుండా ఉంటుంది.
చికిత్స: సోరియాసిస్ లాంటి చర్మవ్యాధులకు హోమియో వైద్యం ఒక వరం లాంటిది. హోమియో వైద్యంలో వ్యక్తియొక్క శారీరక మానసిక లక్షణాలను మరియు వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్సచేయడం జరుగుతుంది. కావున ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా జరుగుతుంది.
మందులు: గ్రాఫైటీస్: చర్మం పొడిబారిపోయి, పగుళ్లు దళసరిగా మారడం, చర్మం నలుపు రంగులోకి మారడం, దురద ఎక్కువగా ఉండి నీరులాంటి రసి కారుతూ ఉంటుంది. వీరు మలబద్ధకంతో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలుండి ఊబకాయం తోడైనవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
సల్ఫర్: సోరియాసిస్‌కు ఇది ప్రధానమైన మందు. ఇది గొప్ప ‘యాంటిసోరిక్’ రెమిడీ. చాలా రోజులనుండి వ్యాధితో బాధపడుతుంటే వారికి ఈ మందు వాడిన ప్రయోజనం. వీరి చర్మం పొడిబారిపోయి, దురద, మంటగా ఉంటుంది. వీరు చర్మం నుండి రక్తం కారుతున్నా కూడా గోకడం మాత్రం ఆపరు. దురద తీవ్రత ఉదయంవేళ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చర్మవ్యాధితో పాటుగా మలబద్ధకంతో బాధపడుతుంటారు. వీరు చర్మవ్యాధులకు పూత మందులు ఎక్కువగా వాడుతారు. వీరి మానసిక స్థాయి లక్షణాలను గమనించినట్లయితే వీరికి స్నానమంటే చిరాకు, స్నానం చేసినా వీరికి హాయిగా ఉండదు. ఇంకా బాధలు ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. వీరు ఉదయం అల్పాహారం తీసుకున్నా మరల 11 గంటలకే ఆకలి బాధతో నీరసించిపోవుట గమనించదగిన లక్షణం, బాధలు తగ్గి తిరిగి మాటిమాటికి కనిపిస్తున్నట్లు అయితే ఈ మందు బాగా పనిచేస్తుంది.
నైట్రోమోర్: ఈ మందు రోజూ వాడుకునే ఉప్పునుండి తయారవుతుంది. శరీర పోషణలో ఉప్పు ప్రధాన ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఉప్పు తక్కువైతే శరీర పోషణలో మార్పు వస్తుంది. ఎక్కువ తీసుకుంటే ఒంటికి నీరు పడుతుంది. నిరాశ, నిరుత్సాహానికి గురైనవారికి ఇది మంచి మందు. దుఃఖం మూలంగా అనారోగ్యానికి గురైనప్పుడు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది. మానసిక స్థాయిలో వీరు దుఃఖంతో కృంగిపోయి ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఓదార్పును వీరు సహించలేరు. ఇటువంటి లక్షణాలు ఉండి ‘సోరియాసిస్’తో బాధపడే వారికి ఈ మందు ముఖ్యమైనది.
లైకోపోడియం: చర్మం పొడిబారిపోయి దురదగా మంటగా ఉంటుంది. ఈ రోగికి సాయంత్రం వేళలో బాధలు ఎక్కువగా ఉంటాయి. వీరు మలబద్ధకంతో బాధపడుతుంటారు. వీరికి దాహం ఎక్కువ. వీరు చూడటానికి సన్నగా ఎండుకుపోయినట్లు కనిపిస్తారు. అజీర్తి, గ్యాస్, ఎసిడిటి, మూత్రావయవాల వ్యాధులతో తరుచూ బాధపడుతుంటారు. వీరి మానసిక స్థాయి లక్షణాలను గమనించినట్లయితే నిజ జీవితంలో ఆచితూచి అడుగువేస్తారు. సామర్థ్యం ఉన్నా నిర్ణయం సరిగా తీసుకోలేరు. పనులను తటపటాయిస్తూ వాయిదావేస్తూ కాలక్షేపం చేస్తారు. ఇటువంటి లక్షణాలు ఉండి సోరియాసిస్‌తో బాధపడే వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
ఆర్సినికమ్ ఆల్బ్: చర్మం పొడిబారిపోయి ఉంటుంది. దురద, మంట ఎక్కువగా వస్తుంది. చలికాలంలో మరియు మధ్యరాత్రిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వీరి మానసిక స్థాయిలో తనచుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా మరియు ఒక వరుసక్రమంలో ఉండాలనుకుంటారు. వీరికి వేడి నీటితో స్నానం చేసిన ఉపశమనంగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రయోజనకారి. అలాగే పెట్రోలియం, సెపియా, రస్‌టాక్స్, సైలీషియా, హెపార్‌సల్ఫ్, థైరాయిడినం వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహామేరకు వాడుకొని ‘‘సోరియాసిస్’’ నుండి ఉపశమనం పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646