సెట్స్‌పైకి గోపీచంద్ చిత్రం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మాస్ హీరోగా చిత్రాలు చేస్తున్న గోపీచంద్, తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్’. డిఫరెంట్ యాక్షన్ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రం తరువాత గోపీచంద్ సంపత్‌నంది దర్శకత్వంలో మరో మాస్ ఎంటర్టైనర్లో నటించనున్నాడు. ‘శంఖం’, ‘రెబెల్’ చిత్రాలు రూపొందించిన శ్రీ బాలాజీ సినీ మీడియా జె.పుల్లారావు, జె.్భగవాన్ నిర్మాతలుగా భారీ బడ్జెట్లో రూపొందించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, గోపీచంద్‌లో వున్న మాస్ లుక్‌ను సరికొత్తగా తమ చిత్రంలో చూపనున్నామని, ఇప్పటివరకు ఆయన చేసిన చిత్రాలకంటే హైఓల్టేజ్‌గా ఉన్నతమైన సాంకేతిక విలువలతో ప్రిస్టేజియస్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని అన్నారు. దర్శకుడు సంపత్‌నంది చెప్పిన కథ నచ్చడంతో రూపొందించే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చాలావరకు విదేశాల్లో చేయనున్నామని, అన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు.