సంజీవని

జలుబు నిత్యం వేధిస్తోందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సీజన్‌లో చాలామంది జలుబుతో వేధించబడుతుంటారు. జలుబు అనేది అంటువ్యాధి. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినపుడు సుమారు ఆరు గజాల దూరం వరకు ఉన్న వ్యక్తులకు కూడా అంటుకుంటుంది. జలుబు అప్పుడప్పుడు చేయడం సహజం. అలాకాకుండా సంవత్సరం పొడువునా కాలంతో సంబంధం లేకుండా దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడేవారు ఎక్కువగా ‘సైనసైటిస్’కు గురికావడం జరుగుతుంది.
కారణాలు
జలుబుకు ముఖ్య కారణం వైరస్ క్రిములే. కొందరికి జలుబు దుమ్ము, ధూళి, వాసనలు, స్ప్రేలు, చల్లని పదార్థాలవలన పడనందున తేలికగా జలుబుకు గురికావడం జరుగుతుంది.
లక్షణాలు
- అస్తమానం ముక్కునుండి నీరు కారడం, తుమ్ములు రావడం
- కోపం, చిరాకు, కళ్లు మంటలతో కూడి నీరు కారడం.
- తలనొప్పిగా, ఒళ్లు వేడిగా ఉండటం, తల ముందుకు వంచితే బరువుగా అన్పించడం.
- శ్వాస సరిగా ఆడక ముక్కు దిబ్బడ వేసినట్లు ఉండటం, కనుబొమ్మల మధ్య నొప్పి రావడం.
- ముక్కులో మంట దురదగా ఉండటం, వాసనలు తెలియకపోవడం.
- శరీరం వేడిగా జ్వరంలాగా ఉండటం, గొంతులో నొప్పిగా ఉన్నట్లు అనిపించటం.
జాగ్రత్తలు
- వ్యాధి ఆరంభంలోనే వైద్యుల దగ్గరకు వెళ్లటంవలన వ్యాధి తీవ్రత పెరగకుండా జాగ్రత్తపడవచ్చు.
- శీతల పానీయాలు, చల్లటి పదార్థాలు, ఫాస్ట్ఫుడ్స్, కేక్స్ తీసుకోవడం మానివేయాలి.
- దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాలలోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ వెళ్లవలసి వస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాలి.
- సరిపడని పదార్థాలను గుర్తించి వాటిని కొద్ది రోజులు తినకుండా ఉండాలి.
- వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి పౌష్టికాహారం నిత్యం తీసుకోవాలి.
- ప్రతిరోజు వ్యాయామం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేయడం వలన వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
చికిత్స
హమియో వైద్యంలో ‘జలుబు’కు మంచి చికిత్స కలదు. వ్యాధి లక్షణాలను మరియు వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేసిన జలుబు నుండి విముక్తి పొందవచ్చు.
మందులు
కాలిబైక్రోమియం: ముక్కు పైభాగంలో తీవ్రమైన నొప్పి, ముక్కుపొడి ఆరిపోయి ఉంటుంది. ముక్కునుండి చిక్కని జిగురుతో కూడిన స్రావాలు తీగలుగా సాగుతుంటాయి. స్రావం తెల్లగా, పసుపుగా, ఆకుపచ్చగా కారుతుంటాయి. తల ముందుకు వంచితే నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రధానమైనది.
నైట్రోమోర్: ‘జలుబు’ తీవ్రత ఉదయం 10 గంటలనుండి 11 గంటలమధ్య సమయంలో ఎక్కువగా ఉంటుంది. నీరసంతో అలసిపోయినట్లుగా ఉండి ముక్కునుండి నీరు కారడం, తుమ్ములు, ముక్కు లోపలి భాగంలో స్రావాలు పొడి ఆరిపోయి ఉంటాయి.
వీరు మానసిక స్థాయిలో కుంగిపోయి ఉంటారు. దుఃఖం పొర్లుకు వస్తుంది. నలుగురిలో కాకుండా వీరు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. ఓదార్పు మాటలు సహించలేకుండుట గమనించదగిన ప్రత్యేక లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
హెపార్‌సల్ఫ్: వీరు చాలా సున్నిత స్వభావులు. తేలికగా జలుబు బాధకు గురవుతారు. చల్లగాలి సోకగానే బాధలు మొదలగును. ముక్కునుండి చిక్కని జిగురుతో కూడిన స్రావాలు ఉండి దుర్వాసన వస్తుంటాయి. మాట బొంగురు పోతుంది. పొడి దగ్గు వస్తుంది. గొంతులో ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించి మింగినపుడు విపరీతమైన నొప్పి వచ్చుట గమనించదగిన ప్రత్యేక లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రధానమైనది.
ఆర్సినికం ఆల్బం: ఈ మందు జలుబుకు తప్పక ఆలోచించదగినది. ముక్కునుండి మంటలతో కూడిన నీరు కారడం, వీరికి మధ్యాహ్నం, అర్థరాత్రి బాధలు ఎక్కువగా వుండుట గమనించదగిన ప్రత్యేక లక్షణం. జలుబుతోపాటు కళ్ళనుండి నీరుకారడం, ఒంటిపై దద్దుర్లు, విపరీతమైన నీరసం, తరచుగా దాహం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. మానసిక స్థాయిలో ఆందోళన భయం వంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
పల్సటిల్లా: జలుబు బాధలకు గురైనపుడు ముక్కునుంచి చిక్కటి పసుపు పచ్చని,, ఆకుపచ్చని స్రావాలు కారుతుంటాయి. జలుబు ఎక్కువగా ఉన్నపుడు రుచి వాసన తెలియదు. వీరు మృదు స్వభావులు. చిన్న విషయానికి కూడా కంటతడిపెడతారు. కంట తడి పెట్టకుండా ఏ విషయాన్ని చెప్పలేకపోవడం గమనించదగిన లక్షణం. ఇటువంటివారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఈ మందులే కాకుండా రస్‌టాక్స్, టుబర్కులినం, ఎల్లియం సెఫా, ఫెర్రంఫాస్, కాలిమోర్, లేకసిస్, కాల్కేరియా కార్బ్, సల్ఫర్ వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడుకుని జలుబు బాధనుండి ఉపశమనం పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646