వరంగల్

కోటికి చేరువలో ‘హరితహారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ మొక్కలు నాటే కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, పోలీసు అధికారులు, ప్రభుత్వాధికారులు పోటాపోటీగా హరితహారం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాగా ప్రజల నుండి కూడా విశేష స్పందన లభిస్తోంది. 50వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం బుల్లితెర నటుల భారీ ర్యాలీ ఆకట్టుకుంది. ఈ ర్యాలీని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థలు, కాలనీవాసులు కూడా కమిటీగా ఏర్పడి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. వరంగల్ జిల్లాలో 3.50 కోట్లు మొక్కలు నాటే లక్ష్యం కాగా ఆదివారం వరకు మొక్కలు నాటే కార్యక్రమం కోటికి చేరువలో ఉంది. కాగా, పండ్ల మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో కొరత ఏర్పడింది. సెలవు దినాల్లో కూడా అధికారులు పక్కనబెట్టి హరితహారంలో పాల్గొంటున్నారు. స్పీకర్ మధుసూదనాచారి కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, మేయర్ నన్నపునేని నరేందర్‌తో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ వాకాటి కరుణ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో కలిసి మొక్కలు నాటారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఒకే రోజు పది ప్రాంతాల్లో మొక్కలు నాటారు. నక్కలగుట్ట ఐకెపి కార్యాలయంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ నన్నపునేని నరేందర్ మొక్కలు నాటారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు.