తూర్పుగోదావరి

ప్రమాదకరంగా పుష్కరఘాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, జూలై 24: మండల పరిధిలోని జొన్నాడలో గౌతమి గోదావరి వద్ద నూతనంగా నిర్మించిన పుష్కర ఘాట్‌లో బురద పేరుకుపోయి ప్రమాదకరంగా మారింది. మరో నాలుగు రోజుల్లో అంత్యపుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. గోదావరి వరదల వల్ల అడుగున్నర మేర బురద పేరుకుపోయింది. ఆ రేవులో స్నానాలు చేసేందుకు ఇప్పటికే అక్కడకు వచ్చే భక్తులకు ప్రమాదకరంగా మారింది. ఈ స్నానాల రేవుల సమీపంలో అతి పురాతనమైన శివాలయం ఉండంతో ప్రతీ సోమవారం అధిక సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరిస్తారు. దీనికి తోడు గత పుష్కరాల్లో ఈ ఘాట్ల వద్ద దేవతామూర్తుల ఆలయాలు నిర్మించడంతో తరచు ఈ ప్రాంతంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఈ పుష్కర ఘాట్లలో తక్షణం బురద తొలగించాలని ఈ రేవుల్లో స్నానాలు ఆచరించిన భక్తులు కోరుతున్నారు.