శ్రీకాకుళం

నాఫ్తా ఆయిల్‌తో.. పెట్రోల్, డీజిల్ కల్తీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 24: ఎక్కడ చూసినా కల్తీ..కల్తీ..కల్తీ. తినే తిండి దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే వస్తువులు వరకూ అన్నీ కల్తీవే. కల్తీ ఫుడ్, నకిలీ వస్తువుల తయారీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. సాస్, కల్తీ నూనెలు, కల్తీ ఇంజన్ ఆయిల్స్, పెట్రోల్, డీజిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే అంతా అంతా కల్తీయే! వీటిని కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ళ మత్తులో తూగుతుండటంతో నకిలీ ముఠాల ఆగడాలకు అడ్డుఅదుపులేకుండా పోతోంది. సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహారిస్తున్నా ఆ శాఖ మొద్దునిద్రలో ఉంది. చురుకైన జాయింట్ కలెక్టర్ జిల్లాలో ఉన్నా పరిశ్రమలు, వాటి భూసేకరణలు, ఇతరత్రా పనుల ఒత్తిడితో చాలా కాలంగా నకిలీ పెట్రోల్, డీజిల్‌పై శ్యాంపిల్స్ తీయడం, ఆకస్మిక తనిఖీలు చేయడం వంటివి మర్చిపోయారనే చెప్పాలి. ఇదే అదనుగా జిల్లా కేంద్రంతోపాటు ఇచ్ఛాపురం సరిహద్దుల నుంచి ప్రారంభమైన కల్తీ పెట్రోల్, డీజిల్ చివరకు శ్రీకాకుళం జిల్లా కేంద్రం వరకూ వ్యాపించింది.
తేల్చిన షోరూం ఇంజనీర్లు
శ్రీకాకుళంలో నాఫ్తా ఆయిల్‌తో కల్తీ చేసి కొన్ని పెట్రోల్ బంకులు పెట్రోల్, డీజల్ అమ్మకాలు యథేచ్ఛగా చేస్తున్నారు. ఇందుకు తార్కణమే గత మూడు మాసాల్లో ఇక్కడ వరుణ్ మారుతీ కార్ల షోరూంకు జిల్లా కేంద్రంలో మారుతీ సిఫ్ట్ కార్లకు ఇంజన్‌లో డీజిల్ పంపింగ్ చేసే యూనిట్లు ఆకస్మాత్తుగా పాడైపోవడం. డీజిల్‌లో నాఫ్తా ఆయిల్ కల్తీ కావడంతో కార్ల స్టార్టింగ్ సమస్య తలెత్తుతోందని ఇంజనీర్లు చెబుతున్నారు. సర్వీసు నిర్వహించే సమయంలో ఇంజన్‌లో ఫ్యూయల్ హైప్రెజర్ పంప్ పూర్తిగా పనిచేయకుండాపోతున్నాయంటూ పేర్కొంటున్నారు. దీని విలువ 42000 రూపాయలు. కేవలం డీజిల్‌లో కల్తీ వల్ల గత మూడు మాసాల్లో ఇక్కడ వరుణ్ షోరూంలో 14 కార్లకు ఈ సమస్య వచ్చిందంటూ సంబంధించిన ఇంజనీర్లు ‘ఆంధ్రభూమి’కి ఆదివారం తెలిపారు. జిల్లాలో కల్తీ ఆయిల్ మాఫియా ఆగడాలు మరింత చురుకుగా సాగుతున్నాయడానికి ఇదే తార్కణంగా చెప్పవచ్చు. గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న కల్తీ ఇంధనం తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. జిల్లాకు కొత్తగా పదవీబాధ్యతలు చేపట్టిన జె.బ్రహ్మారెడ్డి ఎవోబీ సరిహద్దుల్లో గుట్కా ముఠాను మోకాళ్ళపై కుర్చున్నబెట్టిన విధంగా కల్తీ ఇంధనం ముఠాలను అదుపులోకి తీసుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడిందంటూ వాహనచోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తూ.గో నుంచి దిగుమతి
తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, అనపర్తి ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తూ శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేటలో నాఫ్తా ఆయిల్ లోడ్ లారీలు నిల్వలు ఉంచుతూ అక్కడ నుంచి జిల్లా మారుమూల ప్రాంతాలకు కొన్ని పెట్రోల్‌బంకులకు సరఫరా అవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, టెక్కలి శివారు ప్రాంతాల్లో ఫెర్రోస్ కంపెనీ మార్గంలో పాడుపడిన షెడ్‌లో నాఫ్తా ఆయిల్ నిల్వలు ఉంటున్నాయంటూ కొంతమంది యువకులు చెబుతున్నారు. ఈ కల్తీ ఆయిల్ వర్తకుడుగా ఎక్సైజ్‌శాఖలో ఒక ఉద్యోగి వ్యవహారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై లీటరుకు పెట్రోల్‌బంకు డీలర్‌కు 2.30 రూపాయలు కమిషన్ ఆయిల్‌కంపెనీలు ఇస్తున్న నేపథ్యంలో నాఫ్తా ఆయిల్ కల్తీ చేయడంతో లీటరుకు 15 రూపాయల వరకూ ఆదాయం రావడంతో ఈ కల్తీ ఇంధనం వ్యాపారం జిల్లా అంతటా జోరుగా సాగుతోంది. వీటి ద్వారా భారీ మొత్తంలో కల్తీ పెట్రోల్, డీజిల్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. కల్తీరాయుళ్లు బినామీలతో దందా చేస్తున్నట్టు తెలుస్తోంది.
జిల్లా కేంద్రంలోనే డే అండ్ నైట్, రైతుబజారు పెట్రోల్ బంకుల్లో గతంలో కల్తీ పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేస్తూ పౌరసరఫరాలశాఖ అధికారుల తనిఖీల్లో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో కల్తీ ఆయిల్ మాఫియా మూలాలు కనుగొనే పనిలో జిల్లా అధికారులు సమయం కేటాయించకపోతే రానున్న రోజుల్లో వాహనచోదకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతకు అధికారులు, పాలకులు ఎదుర్కొవల్సివస్తోందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.