వరంగల్

ఏకకాలంలో రుణమాఫీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూలై 25: రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేసి కొత్తగా రుణాలు మంజూరు చేయాలని పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ లేతాకుల సంజీవరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి బొచ్చు కృష్ణారావు, పరకాల నగర పంచాయతీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మడికొండ సంపత్‌కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బండి సారంగపాణితో కలిసి పరకాల ఎస్‌బిహెచ్ బ్యాంక్ మేనేజర్ మురళీకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతుల కష్టాలు తీరుస్తామని 17,500 కోట్ల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామని ప్రగల్బాలు పలికి గద్దె నెక్కిన కెసిఆర్ రుణమాఫీలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రుణం తీసుకున్న వారికి పూర్తిగా మాఫీ చేయకపోగా కొత్త రుణాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతు సమస్యలపై అవసరమైతే ధర్నా, రాస్తారోకోలు నిర్వహించైనా వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
రెండో ఎఎన్‌ఎంలందరినీ
రెగ్యులర్ చేయాలి
కాంట్రాక్ట్ రెండో ఎఎన్‌ఎంలందరినీ రెగ్యూలర్ చేయాలని పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పరకాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ 2వ ఎఎన్‌ఎంల సమ్మె శిబిరాన్ని ఆయన ప్రారంభించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ కాంట్రాక్ట్ 2వ ఎఎన్‌ఎంలకు 10వ పిఆర్‌సి ప్రకారం కనీసం వేతనం రూ. 21,300 ఇవ్వాలని, వారికి డిఏ , హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్స్ మంజూరు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్‌లో 10శాతం నిధులు కేటాయించి పిహెచ్‌సిలు, ఆసుపత్రులలో వౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
డాక్టర్లు, నర్సుల
సస్పెన్షన్‌కు డిమాండ్
పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతికి కారణమైన డాక్టర్లను, నర్సులను తక్షణమే సస్పెండ్ చేయాలని పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. ఇన్‌చార్జి సూపరింటెంటెండ్ డాక్టర్ రాజేందర్‌రెడ్డితో మాట్లాడుతూ పసికందు మృతి సంఘటనపై వివరాలు అడుగగా నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని లేనియెడల ఉన్నతాధికారులకు కలిపి ఫిర్యాదు చేస్తామని ఇనగాల పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను, నర్సులను తక్షణమే సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు
ఆర్థిక సహాయం
పరకాలలో ఆనారోగ్యంతో పి. సమ్మయ్య, ఏకు సమ్మయ్యలు మృతి చెందగా.. వారి కుటుంబాలను ఇనగాల పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయం అందచేశారు. ఆయన వెంట జడ్పి ఫ్లోర్ లీడర్ లేతాకుల సంజీవరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి బొచ్చు కృష్ణారావు, పరకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మడికొండ సంపత్‌కుమార్, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి సారంగపాణి, వరంగల్ పార్లమెంటరి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యడ శ్రీనివాస్, ఆత్మకూర్ మండల పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.