తమిళ దర్శకుడితో పవన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 July 2016
పవన్ కళ్యాణ్ నటించే ‘కడప కింగ్’ షూటింగ్ వచ్చే నెల 6న మొదలుకానుంది. శరత్ మరార్ నిర్మిస్తున్న దీనికి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాల్సి ఉండగా, ఇప్పుడు ‘గోపాల గోపాల’ ఫేమ్ డాలీ సీన్లోకి వచ్చాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయిన ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమా తరువాత ఓ తమిళ దర్శకుడితో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు పవన్. ఎ.ఎం.రత్నం నిర్మించే ఈ సినిమా తమిళ సూపర్‌హిట్ ‘వేదాళం’ చిత్రానికి రీమేక్‌గా ఉంటుందని, తమిళంలో ‘జిల్లా’ చిత్రాన్ని తెరకెక్కించిన నిసన్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట పవన్. ఈ సినిమాలను పూర్తిచేసి, 2019 సాధారణ ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో పాల్గొంటాడట!