విశాఖ

పాల్మన్‌పేట బాధితులకు ఆర్థిక సదుపాయం: అమర్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, జూలై 26: పాయకరావుపేట మండలంలోని పాల్మన్‌పేట మత్స్యకార సామాజిక వర్గీయులపై జరిగిన దాడుల్లో గాయపడిన బాధితులకు ప్రభుత్వంతో సమానంగా తమ పార్టీ కూడా ఆర్థిక సదుపాయం (పరిహారం) అందజేస్తుందని జిల్లా వైకాపా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మంగళవారం ఇక్కడకు వచ్చిన ఆయన ఇక్కడి వైఎస్సాఆర్ సిపి కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ఇటీవల పాల్మన్‌పేటలో మత్స్యకార, సామాజిక వర్గీయులపై అదే గ్రామం శివారు రాజయ్యపేటలోని ఒక సామాజిక వర్గం దాడులకు దిగడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అక్కడ జరిగిన సంఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం లక్షరూపాయల చొప్పున చెల్లిస్తామని చెప్పి కేవలం 50వేల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం బాధాకరమన్నారు. మరో 44మంది బాధితులకు పదివేలు చొప్పున 63మందికి ఐదువేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆయన విమర్సించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్మన్‌పేట బాధితులకు లక్ష రూపాయలు చెల్లిస్తామని ప్రగల్భాలు పలికారని కానీ ఆ మేరకు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఏమాత్రం అందజేయలేదని ఆయన విమర్శించారు. వైకాపా అధినేత జగన్‌మోహన రెడ్డి పాల్మన్‌పేట బాధితులను పరామర్సించే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు ప్రభుత్వంతో సమానంగా తమ పార్టీ కూడా బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం 50వేల రూపాయలు చొప్పున ఇస్తే అంతే మొత్తం వైకాపా కూడా బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తుందని గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు.
ప్రభుత్వం మాత్రం కొంతమంది బాధిత కుటుంబాలకు ఐదువేల రూపాయలు మాత్రమే ఇవ్వడం దారుణ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవా చేసారు. ప్రజలు ఇప్పటికే వీరి మోసాలను గ్రహిస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ, ఆ పార్టీ నాయకులు యెల్లేటి సత్యనారాయణ, కోసూరి మదు, ముత్తం శ్రీను పాల్గొన్నారు.