శ్రీకాకుళం

మహిళా సంఘాల మొండి బకాయిలపై స్పెషల్ డ్రైవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, జూలై 26: మండలంలోని చోడవరం గ్రామంలో స్వయంశక్తి మహిళా సంఘాలకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు భారీ మొత్తంలో ఉన్నాయని వాటిని వసూలు చేసేందుకు గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని డిపి ఎం రామ్మోహనరావు తెలిపారు. మంగళవారం ఈసందర్భంగా గ్రామంలో ఉన్న మహిళాసంఘాల వద్ద నుండి వసూళ్లకు చర్యలు చేపట్టారు. 2007-08 సంవత్సరంలో అల్లాడ ఐవోబి బ్యాంకు ద్వారా సుమారు 28 మహిళా సంఘాలకు 72లక్షల రూపాయల రుణాలను అందజేశామని అయితే ఆయా సంఘాలు సుమారు 8 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ బకాయిలు చెల్లించలేదని వివరించారు. బకాయిలు చెల్లించని వారిపై ఆర్ ఆర్ చట్టం కింద ఆస్తులు జప్తు చేస్తామని స్పష్టంచేశారు. ఈ వసూళ్ల కార్యక్రమం రాత్రి వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏరియా కో ఆర్డినేటర్ రాజ్‌కుమార్, ఏపి ఎం సిహెచ్ గోవిందరాజులు, జన్మభూమి కమిటీ సభ్యులు అడపా చంద్రశేఖర్ పాల్గొన్నారు.