తూర్పుగోదావరి

నీటి వృథాకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటనందూరు, జూలై 26: దశాబ్దాల కాలం నుండి తాండవ గేట్లకు మరమ్మతులు లేక సాగునీరు వృథాగా పోయేది. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టి పనులు పూర్తిచేశారు. తాండవ జలాశయం నుండి ఏళ్లతరబడి క్రస్ట్ గేట్లనుండి నీరు వృథాగా పోతోంది. దీనిపై అనేక పర్యాయాలు ఆయకట్టుదారుల సమావేశంలో రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నాలుగు దశాబ్దాల క్రితం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో ఏర్పాటుచేసిన గేట్లకు ఇంతవరకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో నిరంతరం ఈ గేట్లు నుండి నీరు వృథాగా పోయేది. ఎట్టకేలకు అధికారులు గేట్లు మరమ్మతులపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రూ. 35 లక్షల వ్యయంతో ప్రాజెక్టు అభివృద్ధి నిధులతో గేట్లు మరమ్మతులకు అధికారులు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా క్రస్ట్‌గేట్ల నుండి నీరు లీకు అవ్వకుండా మరమ్మతులు చేపట్టారు. అలాగే జలాశయం గరిష్ఠ నీటి సామర్ధ్యం మేరకు నీరు చేరినప్పుడు స్పిల్‌వే గేట్లు ద్వారా తాండవ నదిలోకి నీరు విడుదల చేస్తారు. ఈ నిధులతో స్పిల్‌వే గేట్లకు సైతం రంగులు అద్దారు. అనేక ఏళ్లుగా తాండవ జలాశయం నీరు వృథాగా పోవడంతో సాగునీటి ఇబ్బందులు పడే ఆయకట్టు రైతులు నీటి వృథాను అరికట్టేందుకు గేట్లకు మరమ్మతులు చేపట్టడం పట్ల ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.