అదిలాబాద్

అక్రమ అరె స్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 26: సాగునీటి ప్రాజెక్టుల రిడిజైనింగ్ పేరిట టీ ఆర్ ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతూ రైతుల భూములను బలవంతంగా లాక్కుంటూ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని, మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను మార్గమద్యంలో అరెస్ట్ చేయడం అమానుషమని డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ అన్నారు. మంగళవారం టిపిసిసి పిలుపు మేరకు మల్లన్నసాగర్ రైతులకు మద్దతు పలికేందుకు జిల్లా నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న జిల్లా కాంగ్రెస్ నేతలను డిచ్‌పల్లి జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. సాయంత్రం సొంత పూచికత్తుపై విడుదలైన అనంతరం నరేష్ జాదవ్ స్థానిక మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఫాసిస్టు చర్యలతో రైతుల నోట్లో మట్టికొడుతూ శాంతియుతంగా అందోళన చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసి ఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రైతుల ప్రయోజనాలను ఫనంగా పెట్టి మొండి పట్టుదలతో ప్రాజెక్టులు కట్టడం సిగ్గుచేటయిన విషయమని అన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ అధ్వర్యంలో అందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమాలను ఆపేందుకు అక్రమ అరెస్ట్‌లతో ప్రభుత్వం పోలీసు చర్యలకు దిగితే రైతుల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నరేష్ జాదవ్ తీవ్రంగా ఖండించారు. నరేష్ జాదవ్ వెంట అరెస్ట్ అయిన వారిలో జిల్లా కిసాన్‌సెల్ అధ్యక్షులు బి.మల్లేష్, జిల్లా కార్యదర్శి మల్లెపూల నర్సయ్య, నారాయణ రెడ్డి, కొమరం కోటేష్, మైమూద్ పాల్గొన్నారు.