వరంగల్

విలీన గ్రామాలకు తాగునీటి వసతికి 165 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నగరాభివృద్ధికి కేటాయించిన రూ. 300 కోట్ల నిధుల్లో సింహభాగం రూ. 165కోట్లను 42 విలీన గ్రామాల్లో రక్షిత తాగునీటి సౌకర్యం, వౌలిక వసతుల మెరుగుదలకు వెచ్చించనున్నామని వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ స్పష్టం చేశారు. ఆ దిశగా ఇప్పటికే చేయాల్సిన పనులకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. మంగళవారం ఐదవ డివిజన్‌లోని రహమత్‌నగర్, గణేష్‌నగర్ కాలనీల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్, కార్పొరేటర్ పసునూరి స్వర్ణలతలతో కలిసి మొక్కలు నాటారు. 5వ డివిజన్‌లోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే కోటా కింద ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 70లక్షలతో చేపట్టనున్నట్లు మూడు కాంక్రీట్ రోడ్లకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ నరేందర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ ఆవిర్భావ సమయంలో విలీన గ్రామాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల సూచనలు పరిగణలోకి తీసుకొని విలీన గ్రామాల అభివృద్ధికి పటిష్ఠ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. నగరంలో గడిచిన 65 సంవత్సరాల్లో ఆశించిన అభివృద్ధి జరుగలేదన్నారు. నగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడిన నాలుగు నెలల్లోనే నగర సమగ్రాభివృద్ధి సాధ్యమన్న నమ్మకాన్ని తాము ప్రజలకు కల్పించామన్నారు. గ్రేటర్ వరంగల్ నగరంను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అనువైన కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి పనిలో నిమగ్నమై ఉన్నామన్నారు. కసరత్తు తుది దశకు చేరుకుందన్నారు. ప్రాథమిక పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధమయ్యాక నిపుణులతో చర్చించి మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభించేలా చూస్తామన్నారు. సాగునీరు, సానిటేషన్, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, రోడ్ల డ్రైనేజీ, ఎంప్లాయిమెంట్ జోన్‌లు, లైట్స్ మాస్టర్ ప్లాన్‌లో పెద్దపీట వేశామన్నారు. వారసత్వ నగరంగా ఖ్యాతిగాంచిన వరంగల్‌కు మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలా వారసత్వ కట్టడాలను అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో నూతనంగా 16వేల లైట్లను అమర్చుతామని అన్నారు. 5వ డివిజన్‌లో 1.60కోట్లతో రోడ్ల నిర్మాణం, వౌళిక వసతుల మెరుగుదలకు వెచ్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలకవర్గ సభ్యుల సహకారంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో 2021నాటికి గ్రేటర్ వరంగల్‌ను దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, కార్పోరేటర్ స్వర్ణలత పాల్గొన్నారు.