అదిలాబాద్

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జూలై 27: నియోజక వర్గంలోని అన్నిగ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్యెల్యే ఎన్ దివాకర్‌రావు అన్నారు. బుధవారం మండలంలోని హాజిపూర్, దొనబండ పరిధిలో పంచాయితీ రాజ్ నిధులతో చేపటే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలను తనదృష్టికి తెస్తే వాటిని అధికారుల దృషికి తీసుకువెళ్ళి పనులు త్వరితగతున పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఏలాంటి సమస్యలైనా పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానన్నారు. హాజిపూర్ పరిధిలోని ధర్మారంలో రూ. 46లక్షలతో బీటీ రోడ్డును ప్రారంభించారు. అదేవిధంగా టీకానపల్లిలో సిసి రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. దొనబండ పరిధిలోని బుద్దిపల్లిలో రూ.42లక్షలతో నిర్మాణం పనులు చేపట్టారు. హాజిపూర్‌లోని టీకన్నపల్లిలో మురికి కాలువలు, రోడ్డు పనులు చేపట్టారు. దొనబండలో రోడ్డు పనులు చేపట్టారు. కార్యక్రమంలో ఎంపిపి బేర సత్యనారాయణ, వైస్ ఎంపిపి మందపల్లి శ్రీనివాస్, సర్పంచ్‌లు సతయ్మ, సత్యం, ఉపసర్పంచ్‌లు సత్తయ్య, లచ్చన్న, మండల పార్టీ అధ్యక్షులు దోమ్మటి సత్తయ్య, నాయకులు రాజేశ్వర్‌రావు, పంచాయితీ రాజ్ ఎఇ కామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

31న ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ రాత పరీక్ష
ఆదిలాబాద్ టౌన్, జూలై 27: రవాణా శాఖ, ఎక్సైజ్ కానిస్టేబుళ్ళ నియామకం కోసం ఈనెల 31న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి, కో ఆర్డినేటింగ్ అధికారి డి.సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ రాష్ట పబ్లిక్ సర్వీసు కమిషన్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని రావాలని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు.