తూర్పుగోదావరి

కనీస సౌకర్యాలూ కరవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, జూలై 28: గోదావరి అంత్య పుష్కరాలకు మరో రెండు రోజులే సమయం ఉన్నా ప్రభుత్వం ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవడంతో ఘాట్లలో సౌకర్యాల కల్పనకు అధికారులు ముందుకు రావడం లేదు. దీంతో ఆది పుష్కరాలకు కనిపించిన ఆర్భాటంలో పదోవంతు కూడా అంత్య పుష్కరాల్లో కానరావడం లేదు. గతేడాది జూలై నెలలో జరిగిన గోదావరి మహా పుష్కరాల సందర్భంగా సుమారు తొమ్మిది లక్షలమందికి ఫైగా స్నానాలు ఆచరించిన రావులపాలెం ఘాట్‌కు సైతం ఎటువంటి నిధులు కేటాయించకపోవడంతో అంత్య పుష్కరాల పేరుతో ఎటువంటి పనులు చేపట్టలేదు. గురువారం ఈ ఘాట్‌ను గ్రామ పంచాయతీ అధికారులే భక్తులు నీటి ప్రవాహం వద్దకు వెళ్లేందుకు వీలుగా మార్గాన్ని ఏర్పాటుచేశారు. అంత్య పుష్కరాలకు ఆ స్థాయిలో కాకపోయినా 12 రోజుల్లో సుమారు 60వేల మంది భక్తులు స్నానాలు ఆచరిస్తారన్న అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ కనీస భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టలేదు. మిగతా ఘాట్ల మాదిరిగా రావులపాలెం ఘాట్‌కు మెట్లు నిర్మించే అవకాశం లేకపోవడంతో పడవలు, వలలతో ప్రవాహాన్ని బట్టి ఘాట్ ఏర్పాటుచేయవలసి ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో మార్గం బురదమయంగా మారింది. ప్రవాహం కూడా అధికంగా ఉండడంతో అధికారులు తగు భద్రతా చర్యలు చేపట్టకుంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది. మహా పుష్కరాలకు ఏర్పాట్లుచేసిన జల్లు స్నాన ఘట్టాలు, మరుగుదొడ్ల సామాగ్రి అధికారుల పర్యవేక్షణ లోపించి చోరుల పాలు కావడంతో ప్రస్తుతం అవి ఉపయోగపడే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అంత్య పుష్కర స్నానాలు ఎలా చేయాలో తెలియక భక్తులు అయోమయంలో పడ్డారు. స్నానాలకు అధికారులు కనీస ఏర్పాట్లయనా చేయాలని ప్రజలు కోరుతున్నారు.