శ్రీకాకుళం

‘డయల్ యువర్ మినిస్టర్’కు స్పందన అంతంత మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూలై 28: డయల్ యువర్ మినిస్టర్ కార్యక్రమానికి స్పందన అంతంత మాత్రంగానే ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఇదే కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహిస్తే 33 వినతులు వచ్చాయన్నారు. అయితే, సమయాభావం, ఒక్కో వ్యక్తి అధిక సమయం తీసుకోవడం వలన వినతులు తగ్గినట్టు ఆమె చెప్పారు. కాగా గురువారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేవలం 12 వినతులే అందాయి. జి.సిగడాం మండలం టి.డి.వలస నుండి ఎస్.గోపాలనాయుడు ఫోన్‌చేసి తమ గ్రామంలో ఒకే పేరుతో 11 రేషన్ కార్డులు వచ్చాయని, అందులో 10 కార్డులను తొలగించడానికి దరఖాస్తు చేసుకుంటే తమ పేరుతో ఉన్న రేషన్‌కార్డును తొలగించారని ఫిర్యాదు చేశారు. రాజాం నుండి ఎం.రామారావు ఫోన్‌చేస్తూ గొల్లవీధి రేషన్ డీలరు సరుకులు సక్రమంగా అందివ్వడం లేదని చర్యలు తీసుకోవాలని కోరారు. సంతకవిటి మండలం మందరాడ నుండి గార రామకృష్ణ ఫోన్‌చేసి చౌకధరల దుఖాణం నెం.7లో మరణించిన వారికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు మహిళలకు ఇచ్చే నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయడంపై శిక్షణ ఇచ్చినప్పటికీ వారు తూకంలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు వజ్రపుకొత్తూరు నుండి పి.గుర్రయ్యనాయుడు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. జంపరకోట ప్రాజెక్టు నిర్వాసితులైన గిరిజనులకు దీపం కనెక్షన్లు మంజూరైనప్పటికీ గ్యాస్ ఏజెన్సీలు ఇవ్వడం లేదని పి.సత్యంనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మెళియాపుట్టి నుండి జి.అప్పన్న మాట్లాడుతూ తమ గ్రామంలోని చౌకధరల దుఖాణంలో సుమారు 1300 కార్డులున్నాయని, వేరొక దుఖాణం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, సంయుక్త కలెక్టర్ వివేక్ యాదవ్, డిఎస్‌వో, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు, సిబ్బంది పాల్గొన్నారు.