అదిలాబాద్

కానిస్టేబుళ్ళ సామర్థ్య పరీక్షలో 5338 మంది ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 29: ఆదిలాబాద్‌లో పక్షం రోజులుగా నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ళ శారీర దారుఢ్య ఎంపిక పరీక్షల్లో మొత్తం 5338 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే ఎంపికైన అభ్యర్థులకు చివరిగా రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 15వ తేదీన కానిస్టేబుళ్ళ శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించగా, వీరిలో 4221 మంది పురుష అభ్యర్థులు, 1117 మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించడం జరిగిందన్నారు. మొత్తం పురుషులకు జిల్లాలో 1156 పోస్టులు కేటాయించగా మహిళలకు 69 పోస్టులు భర్తీ కానున్నాయి. లాంగ్‌జంప్, హైజంప్, షార్ట్‌పుట్, రన్నింగ్ పోటీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయులను, రిటైర్డ్ పోలీసు అధికారులను ఎస్పీ శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బయెమెట్రిక్ విధానం ద్వారా ఆధార్ గుర్తింపు ప్రక్రియతో పకడ్బందీగా ఎంపిక పోటీలను నిర్వహించేందుకు సహకరించిన ప్రత్యేక విభాగం అధికారులను ఎస్పీ సన్మానించారు. అనంతరం ఎంపిక పోటీల్లో సహకరించిన వారిలో జి.మహేష్, సాయిచరణ్, శాస్ర్తీ, భూమన్న, నాందేవ్ రవికుమార్, స్వామి, కృష్ణ, సత్యనారాయణ, షబ్బీర్, రవీందర్‌లను ఎస్పీ శాలువ, పూలమాలలతో సన్మానించి, వారికి జ్ఞాపికలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన డిసిఆర్‌బి అధికారి కె.రాజయ్య, ఎఎస్సై అబ్దుల్ అజీస్, కె.్భమన్న, హెడ్ కానిస్టేబుల్ సురేష్, తుకారాం, గోవర్ధన్ రెడ్డి, ఇస్తారి, శంకర్, అశోక్‌లను ఎస్పీ సన్మానించి, వారి సేవలను ప్రశంసించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు జిఆర్ రాధిక, విజయ్‌కుమార్, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు బొర్లకుంట పోచలింగం, ప్రధాన కార్యదర్శి పోతారం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మీర్‌విరాసత్ అలి, దేవిదాస్, ప్రతినిధులు ఎస్‌కె తాజోద్దిన్, పెంచాల వెంకటేశ్వర్లు, ఎంఎ రెహామాన్, కార్యాలయం అధికారులు జి.ప్రదీప్‌కుమార్, దయానంద్, మురళి, పోతారాజు, కొండ రాజు, పారుఖ్, సంజీవ్, కిషోర్ పాల్గొన్నారు.