వరంగల్

సిఎం వౌనం వీడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 29: తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఎంసెట్-2 లీక్ పరిణామాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ వౌనం వీడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసెట్-2 లీక్ వీరులు గతంలో కూడా లీకు వీరులేనని ఇప్పటి వరకు అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే లీకులకు అలవాటుపడ్డారన్నారు. ఎంసెట్-2 లీకు ఏ స్థాయిలో జరిగింది, దీని వల్ల ఎంతమంది ప్రయోజనం పొందారో వారిపైనే చర్యలు తీసుకోవాలని అంటూనే లీకు మొత్తానికే జరిగినట్లయితే రద్దు చేస్తే దానిపై లోతుగా అధ్యయనం చేసి, అవసరమైతే న్యాయ సలహాలను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాజా సంఘటన పట్ల ఎంసెట్-2లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, మానసిక వేదనలో విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం సమాధానం చెపుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విసిల నియామకంపై ఎందుకు తొందరపడిందని, విసిల విషయంలో హైకోర్టులో కేసు నడుస్తుండగానే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆదరబాదరగా విసిల నియామకం చేసి హైకోర్టుచే మొట్టికాయలు తిన్నందుకు స్వయంగా ముఖ్యమంత్రే నైతిక బాధ్యత వహించాలన్నారు. విసిల నియామకం రాజకీయ కోణంలో చూడవద్దన్నారు. మరోవైపు ప్రత్యేక హైకోర్టు విషయంలో న్యాయవాదులు ఆందోళన చేస్తున్నా ఇంత వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాడినా హైకోర్టు లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటికి కూడా ఆంధ్ర న్యాయమూర్తులే తెలంగాణకు వస్తే ఇక రాష్ట్రం సాధించుకొని ఏం లాభమని ఆయన అన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పందించి హైకోర్టు విభజన వెంటనే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో పోడుభూముల రైతులను బజారునపడే ప్రయత్నం చేస్తుందని, ఈ విషయంలో సిపిఐ బాధితుల పక్షాన పోరాడుతుందని అన్నారు. ఆగస్టు 5న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 30 సంవత్సరాలుగా కాస్తుపై ఉన్న వారందరికి అటవీ హక్కుల చట్టం ప్రకారం భూములు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.