తూర్పుగోదావరి

మన్యంలో ఒకే రోజు రెండు శిశుమరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, జూలై 29: ప్రతీ మహిళకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని, వైద్య సహాయాన్ని విస్తుృతంగా అందజేస్తున్నామని, మాతా, శిశుమరణాలు తగ్గిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటల్లో వాస్తవం కనిపించడంలేదు. సరైన వైద్య సహాయం అందక నెలల వయసున్న ఇరువురు శిశువులు మరణించి ఇరువురు తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చారు. మండలంలో కరుదేవుపాలెం అనే మారుమూల గిరిజన పల్లెకు చెందిన రెడ్డి అక్కమ్మ అనే గిరిజన మహిళకు జన్మించిన 48 రోజుల వయస్సు కలిగిన మగబిడ్డ కడుపునొప్పితో బాధ పడుతుండగా గురువారం ఏలేశ్వరం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మందులు తీసుకొని ఇంటికి వచ్చిన అనంతరం బిడ్డ మరణించాడని అక్కమ్మ, ఆమె భర్త శ్రీనులు కన్నీరుమున్నీరుగా విలపించసాగారు. అమీనాబాద్ కాలనీ గ్రామానికి చెందిన కుడకల కాంతి సత్యవతి అనే మహిళకు రెండు నెలల వయసున్న పాప పాలు తాగలేక, ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతుండగా ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి గురువారం తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రిలో ఆ బాలిక చికిత్స పొందుతూ గురువారం రాత్రి ప్రాణాలు విడిచింది. సత్యవతి తొలికాన్పులో పుట్టిన ఈ బిడ్డ మరణించడంతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ రెండు మరణాలు మండలంలో చోటు చేసుకోవన్ని బట్టి ఏజెన్సీలో వైద్య సహాయం ఏవిధంగా ఉందో అర్ధమవుతోంది.
శిశు మరణాలపై వైద్యాధికారి విచారణ
శిశుమరణాలపై జడ్డంగి పిహెచ్‌సి వైద్యాధికారి శ్రీరామ్ శుక్రవారం బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. సత్యవతి బిడ్డ బ్రోకైటిస్ నిమోనియాతో బాధ పడుతుందని, ఇది అరుదైన జబ్బు అని తమ ఆసుపత్రిలో ఆమె పురుడుపోసుకుంది తప్ప వైద్యానికి రాలేదని శ్రీరామ్ తెలిపారు. అక్కమ్మ మగబిడ్డ తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతుండగా ఏలేశ్వరం ఆర్‌ఎంపి వైద్యుని వద్ద చికిత్స పొందినట్టు వెల్లడైందని, ఎటువంటి వైద్య సహాయం పొందారో తెలియరాలేదని, తమ పిహెచ్‌సికి బిడ్డను తీసుకొస్తే రక్షించేవారమని శ్రీరామ్ వెల్లడించారు. దర్యాప్తు నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని శ్రీరామ్ తెలిపారు.