శ్రీకాకుళం

బ్యాంకుల సమ్మెతో నిలిచిన లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూలై 29: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో శుక్రవారం బ్యాంకు సిబ్బంది ఒకరోజు సమ్మె చేపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు వందకోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. కాగా బ్యాంకు యూనియన్లు ఎన్‌సిబిఇ, ఎఐబిఇఎ, బిఇఎఫ్‌ఐ, ఎస్‌బిఐఓఎ, ఎఐబివోసి, ఎఐబివోఎ, తదితర సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. నగరంలోని ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎఐబిఇఎ నాయకులు బి.శ్రీనివాసులు
మాట్లాడారు. చిన్నచిన్న జాతీయ బ్యాంకులను వినీలనం చేసి పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ వ్యాపారంలో పోటీతత్వం పెరిగి లాభాలను ఆర్జిస్తాయని ప్రభుత్వం ఖాతాదారులను మోసం చేస్తోందని విమర్శించారు. విదేశాల్లో అనేక పెద్దపెద్ద బ్యాంకులు దివాలా తీసి ఆయా దేశాల ఆర్థిక సంక్షోభానికి కారణమయిన విషయాన్ని మరువరాదన్నారు. విలీన ప్రక్రియను తక్షణమే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. సంస్థానాల ద్వారా స్వయం ప్రతిపత్తితో ఏర్పడిన ఎస్‌బిఐ అనుబంధ బ్యాంకులు లాభాలను ఆర్జిస్తుంటే వాటిని ఎస్‌బిఐలో విలీనం చేయడం వలన ఆయా ప్రాంతాల మనోభావాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదన్నారు. ధర్నా అనంతరం నగరంలో ఏడురోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించి తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శంకరరావు, ఎం.శ్రీనివాసరావు, మోహనరావు, ప్రభాకర్, సూర్యనారాయణ, పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.