విశాఖ

‘వనం-మనం’ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, జూలై 29: వనం- మనం కార్యక్రమంను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణ తెలిపారు. స్థానిక శ్రీకోదండసీతారామ దేవస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం వనం-మనం కార్యక్రమం ను ఎమ్మెల్యే అట్టహాసంగా ప్రారంభించారు. స్థానిక ఎంపిపి పెంటకోట సుబ్బలక్ష్మీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు రాష్ట్రంలో వనం-మనం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారన్నారు. దీంతో భవిషత్తులో ఎంతో ఉపయోగపడతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలన్నారు. రైతులు, స్థానికులు మొక్కలను ఎండిఓ కార్యాలయంనకు వచ్చి తీసుకువెళ్లి వేయాలన్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని, తాళ్లపాలెం గురుకుల పాఠశాల ఆవరణంలోని ఎమ్మెల్యే మొక్కలను నాటా రు. ఈ కార్యక్రమంలో విశాఖ డెయి రీ డైరెక్టర్ మలసాల రమణారావు, స్థానిక సర్పంచ్ తిరుచోళ్ల నాగేశ్వరీ, పిఎసిఎస్ అధ్యక్షులు, డిసిసిబి డైరక్టర్ శిదిరెడ్డి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు ఉగ్గిన రమణమూర్తి, నిమ్మదల త్రినాథరావు, కొంతం ఆదినారాయణ, వేగి గోపికృష్ణ పాల్గొన్నారు.