అదిలాబాద్

కళాశాల భవనానికి కోటి రూపాయలు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాగజ్‌నగర్, డిసెంబర్ 19: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరుచేసిందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శనివారం జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న బోజనం పథకం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు దూరప్రాంతాల నుండి వస్తున్నారని, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి వారికోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టామని, దీంతో విద్యార్థులు తిరిగి వారి గ్రామాలకు వెళ్లకుండా కళాశాలలోనే భోజనంతిని తరగతులకు హాజరై విద్యనభ్యసించి ఉత్తమ ఫలితాలను సాధించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని, గత సంవత్సరం ఈ కళాశాలలోనే మధ్యాహ్నభోజన పథకం ప్రారంభించిన తర్వాతనే జిల్లాలో ఈ కళాశాలలోనే మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఈ స్పూర్తితోనే నియోజకవర్గంలోని సిర్పూర్, కౌటాల, బెజ్జూర్, దహెగాం, మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ సంవత్సరం ప్రారంభించామన్నారు. వచ్చే సంవత్సరం నుండి ప్రభుత్వం కూడా జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తామని సిఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ప్రభాకర్, మునీర్, కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, తహశీల్దార్ సురేశ్, పట్టణ సిఐ చుక్కా నాగేందర్, సంపత్‌కుమార్, డాక్టర్ దామోదర్‌రావు విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమ్మెల్యే తన స్వంత ఖర్చులతో ముద్రించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను అందచేశారు.