అదిలాబాద్

వైభవంగా అంత్య పుష్కరాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూలై 31: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లిమాత కొలువైన బాసర సన్నిధిలో ఆదివారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిలు గోదావరి నదీ తీరం వద్ద ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణలతో గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభించారు. అంతకుముందు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని మంత్రి అల్లోల దంపతులు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుండి మంగళవాయిద్యాలు, పండితుల మంత్రోచ్చరణలతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవలు ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకవచ్చారు. అనంతరం పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి అల్లోల దంపతులు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గోదారమ్మకు వాయనం సమర్పించారు. పుణ్యస్నానాలు ఆచరించి స్థానిక శివాలయంలో అభిషేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, స్థానాచార్యుడు ప్రవీన్‌పాఠక్, ఆలయ ఛైర్మెన్ శరత్‌పాఠక్, మంత్రి, ఎమ్మెల్యేలకు పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి ఫోటోను, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ గోదావరి అంత్యపుష్కరాలను బాసర క్షేత్రం వద్ద ప్రారంభించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. పుష్కర స్నానం ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుందని రాష్ట్ర ప్రజలందరూ అంత్యపుష్కరాల్లో పాల్గొనాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గోదావరి ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగిందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ విజయరామారావు, ఆలయ కమిటి మాజీ సభ్యుడు నూకం రామారావు, సర్పంచ్ శైలజా సతీశ్వర్‌రావు, అరుణ్‌కుమార్, మల్కన్నయాదవ్, యోగేష్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.