నోరు జారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు శంకర్ సారథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘రోబో-2.0’లో హీరోయిన్‌గా నటిస్తున్న అమీ జాక్సన్ నోరుజారి తమిళ ప్రజల ఆగ్రహానికి గురైంది. జల్లికట్టు ఆటపై నిషేధాన్ని సమర్ధిస్తూ బాలీవుడ్ తారలు చేసిన వ్యాఖ్యలతో గుర్రుమీద ఉన్న తమిళనాడు ప్రజలు ఇప్పుడు ఆ కోపాన్ని అమీజాక్సన్‌పై చూపిస్తున్నారు. సినిమాలకు సంబంధంలేని అంశాలపై ఆమె ఎందుకు నోరు మెదపాలని ప్రశ్నిస్తున్నారు. అందాలతార మాటలు వారిని బాధించాయి. తీరా ఆమె చేసిన తప్పేమిటంటే...జల్లికట్టు నిషేధం మంచిదేనని, మూగజీవాలను హింసించడం సరికాదని అనడమే. నిజానికి అందులో తప్పేమీ లేకపోయినా తమిళులు ఇష్టపడే జల్లికట్టు గురించి ఆమె అలా అనడం వారి కోపానికి కారణమైంది. ఇప్పుడు ఆమెను హీరోయిన్‌గా రోబో-2నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకపోతే సినిమా షూటింగ్‌ను అడ్డుకుంటామని, అవసరమైతే దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నాలుగురోజుల క్రితం ప్రారంభమైన విషయం
తెలిసిందే.