ఇప్పుడంతా ఎంటర్‌టైన్‌మెంట్‌దే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి

ప్రస్తుత ట్రెండ్‌కనుగుణంగా కథను నడిపించడం ముఖ్యం. ప్రేక్షకులు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌నే కోరుకుంటున్నారని అంటున్నాడు దర్శకుడు రవికుమార్ చౌదరి. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సౌఖ్యం’. గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రవికుమార్ చౌదరి చెప్పిన విశేషాలు...
ట్రెండ్‌కు అనుగుణంగా
‘పిల్లా నువ్వులేని జీవితం’ తరువాత మళ్లీ సక్సెస్ బాటలో వెళ్లాలని చేసిన ప్రయత్నమే ఇది. రకరకాల కథలు అనుకున్న తరువాత ‘యజ్ఞం’ కాంబినేషన్‌లో రిపీట్ చేశాం. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా కథను ఎంటర్‌టైన్‌మెంట్‌తో జోడించి తెరకెక్కించాం. కొత్త కథ అని చెప్పను. కానీ, చెప్పడం మాత్రం కొత్తగా వుంటుంది.
వ్యక్తిత్వం మారలేదు
‘యజ్ఞం’ సినిమా తరువాత గోపీచంద్, నేను కలిసి 11 ఏళ్ళ తరువాత చేస్తున్న సినిమా ఇది. అప్పటికీ ఇప్పటికీ తనలోని వ్యక్తిత్వం మారలేదు. అయితే నటుడిగా చాలా మెచ్యూరిటీ వచ్చింది. ముఖ్యంగా ట్రెండ్‌కు అనుగుణంగా తనని తాను మార్చుకుంటూ లుక్‌లో కొత్తగా కన్పిస్తున్నాడు.
హైలెట్స్
ఈ సినిమాలో హైలెట్ అంశాలు చాలా వుంటాయి. ముఖ్యంగా ఎడిటింగ్, ఫొటోగ్రఫి, మ్యూజిక్ హైలెట్‌గా నిలిచాయి. ఆడియో మంచి విజయం సాధించడంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. మాటలు కూడా హైలెట్‌గా నిలుస్తాయి. అలాగే, సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూసి బాగుందని మెచ్చుకోవడం మరింత ఆనందాన్నిస్తుంది.
మొదటి అవకాశం
భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో నాకు మొదట అవకాశాన్ని ఇచ్చారు ఆనంద్ ప్రసాద్. మనసుతో అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాను. అపుడు జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్తపడ్డాను. ఈ సినిమా కేవలం ఆరు నెలల్లో పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశాం. ఆనంద్ ప్రసాద్ పక్కా ప్లానింగ్‌తో చేయడంవల్లే ఇది సాధ్యమైంది.
మంచి డాన్సర్
రెజీనాతో ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాకు కలిసి పనిచేశాం. ఆ సినిమా కంటే ఇందులో చాలా గ్లామరస్‌గా, అందంగా కన్పిస్తుంది. ముఖ్యంగా తన డాన్సు చూసి ఆశ్చర్యపోయాను. ఆమెలో అంత మంచి డాన్సర్ వుందని తెలియదు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వస్తుంది.
కామెడీయే మూలం
నిజానికి మూస కథలతో సినిమాలు చేస్తున్నారని అంటున్నారు.
పరిశ్రమలో నాలుగైదేళ్లకు ట్రెండ్ మారుతూ వుంటుంది. ఇపుడు ఎంటర్‌టైన్‌మెంట్‌దే హవా. కామెడీ చిత్రాలు పాత కాలం నుండీ వస్తూనే వున్నాయి. అలాగే, యాక్షన్ సినిమాల్లో కూడా కామెడీ వుంటుంది. ఏదేమైనా సినిమాకు కామెడీయే మూలం.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతానికి కథలు రెడీ చేస్తున్నా. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు.

-శ్రీ