సంజీవని

మందులు వికటిస్తాయి జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని మందులు వాడడంవల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతుంటాయి. అయినా ఎందుకు వాడవలసి వస్తుందంటే, అలా ఒదిలేస్తే అంతకన్నా పెద్ద ఉపద్రవం కలుగుతుందన్నప్పుడు... తప్పక అందుకే వైద్యులు నిర్దేశించిన మొత్తాలలో (ప్రొటీన్స్) చెప్పినన్ని రోజులే వేసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా ఏ మందులూ వేసుకోకూడదు. కొన్ని కొన్ని మందుల్ని కలిపి వేసుకుంటే రసాయనిక చర్యలు భిన్నంగా ఉండవచ్చు. అందుకని వైద్యుడు వేసుకోమనే మందుల్ని కూడా ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవాలో కూడా చెబుతాడు. మనంతటికి మనం ఏ మందుల్నీ సరాసరి మందుల దుకాణంలో కొని వేసుకోకూడదు. మందుల దుకాణాల్లో కూడా వైద్యుల చిట్టీ లేకుండా ముఖ్యంగా కొన్ని మందుల్ని అమ్మరు. మనం ఏ మందుల్ని కొన్నా తయారీ ఎప్పుడైందో ఆ తేదీతోపాటు ఆ మందు ఎక్స్‌పైరీ తేదీని కూడా జాగ్రత్తగా చూసి మరీ మందుల్ని వాడాలి. ఎక్స్‌పైరీ తేదీని దాటిన మందుల్ని వాడితే వికటిస్తాయి.
యాంటీ ఇన్ఫల్మేటరీ మందులు ఎనాల్జిసిక్స్, బ్రూఫెన్, నాప్రోసిన్‌లను వాడడంవల్ల ఛాతీలో మంట, తల తిరగడం, కడుపులో నొప్పి, వాంతులు, ఆహార నాళాల్లో రక్తస్రావం, అజీర్ణం, నీళ్ల విరేచనాలు, తలనొప్పి, మత్తుగా ఉండడం, చర్మం మీద ఎర్రటి దద్దుర్లు రావచ్చు. కార్వాసిన్, నైట్రేడిస్క్‌లాంటి యాంటీ ఎంజైనల్ నైట్రేట్స్ వాడడంవల్ల తలనొప్పి, తల తేలిపోతున్నట్టుండడం, తల తిరగడం, వాంతులు, గుండె కొట్టుకునే వేగం పెరగడం, చర్మం ఇనె్ఫక్షన్లవంటివి కలగవచ్చు. సిఫలోస్పోరిన్స్- సెక్లారె, కెఫ్లెక్స్ వాడడంతో గుదము, మర్మావయవ ప్రాంతంలో దురద, విరేచనాలు, తల తిరగడం, వాంతులు, చర్మంమీద దురదలు లాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎరిత్రోమైసిన్ మందులతో తల తిరగడం, వాంతులు, విరేచనాలు, చర్మం ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. టెట్రామైసిన్‌తో చర్మం మీద ర్యాష్, తల తిరగడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
డైలాంటిన్ లాంటి యాంటీ కన్వల్సెన్స్ మందులతో మాట తడబడడం, అయోమయ స్థితి, చూపులో తేడాలు, చిగుళ్ళు వాయడం, చర్మంమీద ర్యాష్, తల తిరగడం, వాంతులు, అజీర్ణం, హెపటైటిస్ లాంటివి కలగవచ్చు. యాంటీ డయాబెటిక్స్ వాడడం (డయాబినేజ్) వల్ల కూడా చర్మం ర్యాష్, ఛాతీలో మంట, కామెర్లు, ఎక్కువ మందులు తీసుకోవడంవల్ల రక్తంలో షుగర్స్ బాగా తగ్గిపోవడం జరగవచ్చు. ఎవిల్, హిస్టాలెక్ట్, పెరియాక్సిన్, పొలారమైన్ లాంటి యాంటీ హిస్టమిన్ మందులతో మత్తు, అలసట, నీరసం, ముక్కు, నోరు, గొంతు ఎండిపోవడం, తలనొప్పి, రెండుగా కనిపించడం, నరాల్లో ఇబ్బంది, ఆకలి తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఆల్డోమెట్, డయాజైద్ లాసిక్స్, మినిత్రస్ లాంటి యాంటీ హైపర్‌సెన్సివ్ మందుల్ని వాడడంవల్ల రక్తపోటు తగ్గిపోవడం, తల పేలిపోతున్నట్టు ఉండడం, ఇంపోటెన్సీ లాంటి లక్షణాలు కనిపించవచ్చు. బీటా బ్లాకర్స్‌వల్ల అలసట, కాళ్లు చేతులు చల్లబడడం, చర్మంలో ర్యాష్, ఆకలి తగ్గిపోవడం, తల తిరగడం, వాంతులు, అజీర్ణం, విరేచనాలు లాంటి లక్షణాలు పొడచూపవచ్చు. బ్రెవినార్, మైక్రోజైనాన్, నాక్టేడ్, ఒవ్వులెన్, ట్రైక్విలార్ లాంటి నోటి ద్వారా వేసుకునే కాంట్రాసెప్టివ్ కాంబినేషన్స్‌తో తల తిరగడం, వాంతులు, కడుపులో క్రాంప్స్, కడుపుబ్బరం, ఆకలి తగ్గడం, బరువు పెరగడం, బహిష్టు సమస్యలు, చర్మంమీద ర్యాష్, ఈస్ట్ ఇనె్ఫక్షన్స్, రొమ్ములు ఉబ్బడం, రక్తపోటు పెరగడం, గాల్‌బ్లేడర్ జబ్బులు, ఊపిరితిత్తులలో గడ్డలు కట్టడం లాంటి గుండె, రక్తనాళాల జబ్బులు రావచ్చు.
లానోక్సిన్ లాంటి డిజిటలిస్ ప్రిపరేషన్స్‌తో తల తిరగడం, వాంతులు, విరేచనాలు, మత్తు, తలనొప్పి అయోమయం, పసుపుపచ్చగా కనిపించడం, గుండె కొట్టుకోవడంలో అవకతవకలు కలగవచ్చు. అలాగే డ్యూలెటిక్స్ వాడడంవల్ల తల పేలిపోతున్నట్టు ఉండడం, తల తిరగడం, యూరిక్ యాసిడ్స్, బ్లడ్‌షుగర్ పెరగడం, కండరాలు నీరసించడం, క్రాంప్స్, చర్మంపై ర్యాష్, వాంతులు, విరేచనాలు, జాండిస్, బోన్‌మ్యారో సమస్యలు ఉత్పన్నం కావచ్చు. హిస్టామిన్ వాచ్-2 బ్లాకర్స్ మందుల్ని వాడడంవల్ల తల తిరగడం, తల నొప్పి, స్కిన్ ర్యాష్, విరేచనాలు, కండరాల నొప్పులు, వణుకు, గుండె కొట్టుకోవడంలో అవకతవకలు, రొమ్ము వాచడం, తెల్ల రక్తం కణాలు తగ్గిపోవడం లాంటి లక్షణాలు కలగవచ్చు. థైరాయిడ్ హార్మోన్స్ తీసుకోవడంవల్ల చెమటలు బాగా పట్టడం, స్కిన్ ర్యాష్, బహిష్టు సమస్యలు, నిద్రపట్టకపోవడం, గుండె కొట్టుకోవడంలో మార్పులు, తెల్ల రక్తకణాలు తగ్గడం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. ట్రాంక్విలైజర్స్ వాడడంవల్ల మత్తు, అయోమయం, స్కిన్ ర్యాష్, చూపు సరిగా లేకపోవడం, మాటల్లో తేడా లాంటి లక్షణాలు కనిపించవచ్చు. క్జాంథైన్ బ్రాంకో డైలేటర్స్‌వల్ల నిద్ర పట్టకపోవడం, తల నొప్పి, స్కిన్ ర్యాష్, తల తిరగడం, వాంతులు, కడుపులో నొప్పి, గుండె కొట్టుకోవడంలో మార్పులు లాంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకని వైద్యుడి సలహా లేకుండా ఏ మందులు పడితే ఆ మందుల్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. గతంలో వాడాము కదా అని మళ్లీమళ్లీ వైద్యుడి సలహా లేకుండా వాడకూడదు. ఇతరులు వాడారనో, మందుల షాపు వ్యక్తినడిగో ఇష్టంవచ్చినట్టు మందులు వాడకూడదు. వైద్యుడి సలహాల మీద వాడాలి జాగ్రత్త!