వరంగల్

దేవాదుల పంపింగ్ ద్వారా చెరువులు నింపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 23: జిల్లాలో దేవాదుల పంపింగ్ ద్వారా చెరువులలో నీ టిని నింపి వాటి పరిధిలో ఆయకట్టు నీరు విడుదల చేసి పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దేవాదుల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ, ఇంజనీరింగ్, వ్యవసాయశాఖ అధికారులతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు వేసిన పంటల పరిస్థితిపై సమీక్షించా రు. జిల్లాలో మొక్కజొన్న, పత్తి పం టల పరిస్థితిపై వ్యవసాయశాఖ అధికారులను మండలాలవారీగా సమీక్షించా రు. జిల్లాలో తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఆగస్టులో వ ర్షాలు పడలేదని మొక్కజొన్న 61వేల హెక్టార్లలో పండించగా 23వేల హెక్టార్లలో వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వ్యవసాయశాఖ అధికారులు వివరించారు. ప్రస్తుతం దేవాదుల ఎత్తిపోతలద్వారా ఎస్సారెస్పీ, ఎల్‌ఎండి కాకతీయ కాలువ ద్వారా నీటి ల భ్యతనుబట్టి తాగునీటికి సరిపడే నిల్వ తరువాత ఆయకట్టుకు నీరందించేందు కు చెరువులను సెప్టెంబర్‌లోగా నింపేందుకు రెవెన్యూ, వ్యవసాయశాఖ, పోలీస్, సాగునీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో, ప్రణాళికతో ఆయకట్టుకు నీరు విడుదల చేయాలన్నారు. దేవాదుల పంపింగ్‌ద్వారా ధర్మసాగర్ చెరువుకింద దక్షిణ, ఉత్తర కా లువ ద్వారా ఈనెల 25 నుండి మొదటి విడత ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఉత్తర కాలువ ద్వారా మూడు క్యూమెక్స్, దక్షిణ కాలువ ద్వారా ఆరు క్యూమెక్స్‌లు మొదటి విడత పది రో జులపాటు రైతాంగం ఆయకట్టుకు వి డుదల చేయాలన్నారు. వారం రోజుల తరువాత సరిపోయిన నీటిమట్టం వచ్చిన తరువాత ఆర్‌ఎస్ ఘన్‌పూర్‌కు కుడికాలువ ద్వారా రైతాంగానికి నీటిని విడుదల చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకోవడంతో పాటు నీటి లభ్యతను అనుసరించి ప్ర తి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నీటి విడుదల సందర్భంగా అక్రమంగా కాలువలకు గండి కొడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ అధికారు లు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల పరిస్థితిని పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలు రైతులకు అందించాలన్నారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ, సాగునీటిశాఖ అధికారులు ఆయకట్టు పరిధిలో ఏఏ చెరువులు, ఏఏ ప్రాంతా ల్లో నీటిని నింపాలో రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమ ంలో కలెక్టర్ వాకాటి కరుణ, జాయి ంట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఇంజనీర్ విజయ్‌ప్రకాష్, ఎస్సారెస్పీ సిఇ శంకర్, తదితరులు పాల్గొన్నారు.