శ్రీకాకుళం

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 30: విద్యార్థుల ఆరోగ్యపరిరక్షణకు డీవార్మింగ్ తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వవిప్ కూన రవికుమార్ పేర్కొన్నారు. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు ఆల్బెండోజోన్ మాత్రలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీ వార్మింగ్ చేయడం వలన ఏనిమియా వ్యాధి నిరోధించవచ్చునన్నారు. పిల్లలు అనారోగ్యంతో బాధపడితే చదువు ముందుకు సాగదన్నారు. ఒకసంవత్సరం నుండి 16 ఏళ్ళలోపు వయస్సుగల విద్యార్థులకు డీ వార్మింగ్ మాత్రలకు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు బాలల పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పాఠశాలలు గ్రామంలో ప్రభుత్వ యంత్రాలను వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పెద్ద ఎత్తున మాత్రలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ పిల్లల కడుపులో నులిపురుగులు ఉండటం వలన రక్తహీనతకు గురౌతారని చెప్పారు. జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన వల్ల వ్యాధులు సంభవిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతవాసులు దీనిని నివారించి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. మరుగుదొడ్లనిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, నగర పాలక సంస్థ కమిషనర్ శోభ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.తిరుపతిరావు, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ దవళ భాస్కరరావు, ఇమ్యునైజేషన్ అధికారి మెండ ప్రవీణ్, పాఠశాల హెచ్‌ఎం దేవదత్తా, మెడికల్ బృందం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.