జగన్నాథానికి జోడీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.జె. (దువ్వాడ జగన్నాథం)గా అలరించబోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్ అనే్వషణ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో గ్లామర్ భామ కాజల్ హీరోయిన్‌గా నటిస్తోందంటూ వార్తలొస్తున్నాయి. కానీ, ఈమె ప్లేస్‌లో ఇప్పుడు మెహరిన్ చేరింది. నాని హీరోగా రూపొందిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై తొలి చిత్రంతోనే అందరి మన్ననలు అందుకున్న ఈ భామ, ఇప్పటికే అల్లు శిరీష్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ సినిమాలో కూడా నటిస్తోందంటూ వార్తలొస్తున్నాయి. కథ ప్రకారంగా ఈమె అయితేనే బాగుంటుందని యూనిట్ భావిస్తోంది. కేవలం ఒక్క చిత్రంతోనే అల్లు అర్జున్‌లాంటి హీరో సరసన ఛాన్స్ కొట్టేసే అవకాశం రావడం నిజంగా మెహరిన్ టాలెంట్‌కు నిదర్శనం. అందానికి అందం, నటన పుష్కలంగా వున్న మెహరీన్ తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం వుంది.

చిత్రం..కాజల్, అల్లు అర్జున్