తూర్పుగోదావరి

ఆత్మగౌరవ సభ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ విజయవంతం కావడంతో జనసేన శ్రేణులు, అభిమానుల్లో పవనోత్సాహం వెల్లివిరిసింది. జిల్లా కేంద్రం కాకినాడలోని జెఎన్‌టియుకె మైదానంలో అనుకున్న సమయం 4 గంటల కంటే 15 నిముషాలు ముందుగా 3.45 గంటలకు సభాస్థలికి పవన్ చేరుకున్నారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య వేదికనెక్కిన పవన్ వెనువెంటనే ప్రసంగాన్ని ప్రారంభించారు. 1.15 నిముషాల పాటు ఉద్వేగంతో పవన్ ప్రసంగించిన తీరు అభిమానులను విశేషంగా అలరించింది. జనసందోహాన్ని చూస్తూ తనదైన శైలిలో పంచ్ డైలాగ్‌లు, సినిమాటిక్ సంభాషణలతో జనాన్ని ఉర్రూతలూగించారు. సభలో పవన్ తప్ప ఇతరులెవరూ మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఆద్యంతం ఒన్‌మేన్ షోగా సాగింది. సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ్ తరహాలో పవన్ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. గంటంపావు ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. ఆత్మగౌరవ సభలో పాల్గొనేందుకు ఒకరోజు ముందుగానే కాకినాడ వచ్చిన పవన్ శనివారం వరకు నగరంలో ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశం కంటే కాంగ్రెస్, బిజెపిలపైనే పవన్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడును టార్గెట్ చేస్తూ పవన్ మాట్లాడిన సందర్భాలలో ప్రజల నుండి చప్పట్లు వినిపించాయి. ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంపేశారని, ఆ పార్టీకి చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలందరూ తక్షణం ఇతర పార్టీల్లోకి చేరిపోవల్సిందిగా పవన్ సూచించారు. దీనిపై సభానంతరం రసవత్తర చర్చ జరిగింది. ఈ విషయంలో పవన్ తెలుగుదేశానికి బదులు బిజెపి పేరును పలికివుంటారా? అన్న చర్చ కూడా జరిగింది. కేంద్రం ఇచ్చిన పాచి రెండు లడ్డూలు సీమాంధ్రులకు ఎక్కడ సరిపోతాయి? మనకున్న 25 ఎంపిలకే అవి సరిపోవని వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశమయ్యింది. స్థానిక ఎంపి, ఎమ్మెల్యేలకు కూడా పవన్ వ్యాఖ్యలు వర్తించినట్టే కదా? అని పలువురు చర్చించుకున్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శనివారం బంద్‌కు పిలుపునిచ్చిందని, దీనికి తాను వ్యతిరేకం కానని చెప్పారు. అయితే మన ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఎంపిలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ, పార్లమెంట్‌లకు వెళ్ళి సబ్సిడీ భోజనాలు ఆరగిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ప్రజాప్రతినిధులు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తుంటే, ప్రజలు తమ పనులు మానుకుని ఆందోళనలతో రోడ్డెక్కడం చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందన్నారు. ప్రజలు పోరాడుతూనే ఉండాలి, నాయకులు తప్పుడు హామీలతో మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తూనే ఉండాలా? అని ప్రశ్నించారు. సిపిఎం నేత రామకృష్ణను పవన్ తన ప్రసంగంలో పొగడ్తలతో ముంచారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్టు అప్పట్లో సిపిఎం నేత సీతారాం ఏచూరి చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా పవన్ గుర్తుచేశారు. రాజమహేంద్రవరం ఎంపి ఎం మురళీమోహన్ వ్యాపారాలు చేసి బాగానే సంపాదించారని, తను అవసరమైతే సినిమాలు మాని బయటకు వచ్చేయగలనని, మీరు వ్యాపారాలు మానుకోగలరా? అని మురళీమోహన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. రెండున్నర సంవత్సరాలుగా నిద్రపోతున్నావా? అని కొందరు తననడిగారని, అది నిద్ర కాదు, ధ్యానం అని వారెందుకు తెలుసుకోలేకపోయారని ప్రశ్నించారు. రాజకీయాలంటే గెడ్డం గీసుకున్నంత తేలిక కాదని మరో నేత విమర్శించారని, గెడ్డం గీసుకునేంత సమయంలోనే రాష్ట్రాన్ని విభజించారు కదా? అని ఆయన వాపోయారు. సభ ప్రారంభంలో భారత్ మాతాకీ జై అంటూ పవన్ నినానాలు చేశారు. పవన్ బహిరంగ సభాస్థలిని పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. పవన్ వేదిక ఎక్కగానే జిల్లా అడిషనల్ ఎస్పీ ఎఆర్ దామోదర్ తదితరులు అక్కడికి చేరుకున్నారు.