వరంగల్

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, సెప్టెంబర్ 11: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా, రాబోయే రోజులలో కూడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున వరంగల్ నగర పాలక సంస్థ పరిథిలోని అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదివారం నగర మేయర్ నన్నపనేని నరేందర్ సూచించారు. అధిక వర్షాల వల్ల నగరంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన యంత్రపరికరాలతో సర్వసిద్దంగా ఉండాలని ఆదేశించారు. మురుగునీటి కాల్వలలో ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాలను తొలగించాలని, విద్యుత్తు ప్రమాదాలు జరుగకుండా చూడాలని విద్యుత్తు అధికారులను సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం పారిశుధ్ద్య కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 12నుండి 17వరకు వారంరోజుల పాటు అధికారులు, సిబ్బంది విధులలోనే కొనసాగాలని, నగరం విడిచి వెళ్లకూడదని తెలిపారు. ఆదేశాలను బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.