వరంగల్

ఓరుగల్లులో జోరువాన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 23: జిల్లాలో గత కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తు న్న వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండి సమస్యాత్మక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ తన చాంబర్‌లో పోలీసు కమిషనర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వర్షం పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరుణ మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, పశు వర్థకశాఖ, నీటి పారుదల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్‌శాఖ, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించి జరిగిన నష్టాలను అంచనా వేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరంగల్ కార్పోరేషన్ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తరలించి సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వసతి, భోజన సౌకర్యం కల్పించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన వరదనీటిని తోడే విధంగా అవసరమైన ప్రొక్లెయినర్‌ను ఆయా ప్రాంతాలకు పంపించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో దాదాపు 5550 చెరువులకుగాను 4వేల చెరువుల్లో పూర్తిస్థాయిలో నీళ్లు నిండి మత్తడి పడటం జరుగుతుందన్నారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖ, మండల స్థాయి అధికారులు గ్రామస్థాయిలో ప్రతి చెరువును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ బుంగలు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే వచ్చిన సమాచారం ప్రకారం 60చెరువులు కట్టలు తెగిపోవడం జరిగిందని, అట్టి కట్టల పునరుద్ధరణకు ఇసుక బస్తాలతో తాత్కాలిక నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా తెగిపోయిన రోడ్లను వెంటనే రవాణా సదుపాయం కలిగే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలన్నారు. భారీ వర్షాల మూలంగా జిల్లాలో పెద్ద ఎత్తున పంటనష్టం వాటిల్లినట్లు తెలిసిందని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలవారిగా పంట నష్టాలను అంచనా వేసి నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లాలో పదిహేను రోజుల నుంచి కురుస్తున్న వర్షాల మూలంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్యసిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వైద్యసేవలు అందించాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలన్నారు. జిల్లాలో అధికారులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయడం జరగదన్నారు. సిబ్బంది 24గంటల పాటు స్థానికంగా అందుబాటులో ఉండి శాఖపరమైన నష్టనివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సిపి సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝాలు మాట్లాడుతూ జిల్లాలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. అవసరమున్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం, సహాయ చర్యలు చేపట్టే విధంగా ఆదేశించామన్నారు.

నీటమునిగిన కాలనీలు

వరంగల్, సెప్టెంబర్ 23:గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ఎడతెరపిలేకుండా కురస్తున్న జోరువర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులకు జలకళ వచ్చింది. అనేక చెరువులు అలుగుపారుతున్నాయి. మరికొన్ని చెరువులకు బుంగలుపడ్డాయి. వడ్డెపల్లి చెరువు అలుగుపారడంతో సమీపకాలనీలన్ని జలదిగ్భందానికిగురైనాయి. వరదనీరంత ఇళ్లలోకి వచ్చిచేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనారు. వరదల కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు కలెక్టర్ సెలవుప్రకటించారు. వర్షపునీరు రోడ్లపైకి చేరుకోవడంతో కరీంనగర్-వరంగల్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణ పరిధిలోని లోతట్టుప్రాంతాలు జలమయంకాగా పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరంగల్-హైద్రాబాద్ జాతీయరహదారిలోని ఫారెస్టు కార్యాలయం సమీపంలో రోడ్డుపై వరదప్రవాహం ఉద్దృతం కావడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాలతో ఆర్టీసి జిల్లా వ్యాప్తంగా 160 సర్వీసులు రద్దు చేసింది. హన్మకొండ డిపోలో 5రూట్లలో50సర్వీసులు, వరంగల్ -1డిపోలో3రూట్లలో 40 సర్వీసులు, నర్సంపేట 4రూట్లలో15సర్వీసులు, తొర్రూరు 4రూట్లలో 20 సర్వీసులు, మహాబూబాబాద్ 2రూట్లలో 10సర్వీసులు, వరంగల్-2డిపోలో2రూట్లలో 7సర్వీసులు, జనగామడిపోలో7రూట్లలో 15సర్వీసులు, పరకాల, భూపాలపల్లి ఒక్కోరూటులో4సర్వీసులు పూర్తిగా రద్దు చేయగా ఆర్టీసికి దాదాపు15లక్షల నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా పట్టణ పరిధిలోని కాజీపేట బాపూజీనగర్‌లోని పలు కాలనీలలో ఇండ్లలోకి వర్షంనీరు చేరుకుంది. గ్రేటర్ పరిధిలోని సాకరాసికుంట, ఎస్‌ఆర్‌నగర్, లక్ష్మిగణపతి కాలనీ, అమరావతికాలనీ, నయింనగర్, సమ్మయ్యనగర్‌తో పాటు అనేక లోతట్టుప్రాంతాలు జలమయమైనాయి. లోతట్టుప్రాంతాలన్ని చెరువులను తలపించాయి. వర్షాలపై పరిస్ధితిని సమీక్షించేందుకు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, నగరమేయర్ నన్నపనేని నరేందర్, కలెక్టర్ వాకాటి కరుణ, సిపి సుధీర్‌బాబు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్ పలు కాలనీలలో పర్యటించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫంక్షన్‌హాల్లు, కళాశాలలు, కమ్యూనిటీభవనాలలోకి దాదాపు 6వేల మందిని తరలించి వారికి ఆహారపొట్లాలు, తాగునీరు అందించారు. భారీ వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈసందర్భంగా డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.

పరకాల రెవెన్యూ డివిజన్‌పై
ఎమ్మెల్యే వైఖరి ఏమిటీ?
పరకాల, సెప్టెంబర్ 23: పరకాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పరకాల ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ పరకాలలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ అఖిల పక్షం, సాధన సమితి, వర్తక సంఘా లు, విద్యార్థి సంఘాలు, వడుప్సా, కళాశాలలు తదితర సంఘాలు ముందుకు వస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కనీసం దీక్షలను సందర్శించకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన ప్రయోజనాల కోసం పరకాలను ముంచాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. పరకాలను రెవెన్యూ డివిజన్‌గా చేసేందుకు అన్ని అనుకూలతలు ఉన్నప్పటికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన ప్రయోజనాల కోసం పరకాల రెవెన్యూ డివిజన్‌పై నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. ఇది వరకు ఉన్న రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటున్నారే తప్ప కొత్తగా అడగడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నుండి సానకూలమైన స్పందన రాకపోవడం బాధకరమని అన్నారు. డివిజన్ రాకపోతే పరకాల చరిత్ర కాలగర్భంలో కలిసి పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు కాపాడుకునేందుకే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపి పసునూటి దయాకర్ వౌనం వహిస్తున్నారని చెప్పారు. పరకాల ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్న వీరు క్షమార్హులు కారన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. పదవులు శాశ్వతం కాదని ప్రజల గుండెల్లో నిలువాలన్నారు. డివిజన్ కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే అరెస్టులు చేయడం సరికాదన్నారు. పరకాలలో నిర్వహించే మహా గర్జనకు ప్రొఫెసర్ కోదండరాం వస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సాధన సమితి కన్వీనర్ రేపాల నర్సింహరాములు, ఆత్మకూర్ జడ్పిటిసి లేతాకుల సంజీవరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొచ్చు క్రిష్ణారావు, కాటూరి శ్రీ్ధరాచార్యులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బండి సారంగపాణి, కొయ్యడ శ్రీనివాస్, మడికొండ శ్రీనివాస్, మార్క రఘుపతిగౌడ్, విజయ ఆగ్రో తిరుపతిరెడ్డి, చెన్నోజు బిక్షపతి, మచ్చ సుమన్, టిడిపి పట్టణ అధ్యక్షులు పోరండ్ల రాజయ్య, సిపిఎం డివిజన్ కార్యదర్శి నక్క చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

రైతాంగాన్ని ఆదుకోవాలి : సిపిఐ
నర్సంపేట, సెప్టెంబర్ 23: గత మూడు రోజులు కురుస్తున్న వర్షాలకు నర్సంపేట మార్కెట్‌లో ఆరబోసుకున్న మొక్కజొన్నలు కొట్టుకపోయాయని, బాధిత రైతంగాన్ని ఆదుకోవాలని సిపిఐ నర్సంపేట నియోజకవర్గ కార్యదర్శి అక్కపెల్లి రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు సిపిఐ ప్రతినిధి బృందం ఆర్డీవో రామక్రిష్ణారెడ్డి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి అశోక్‌ను శుక్రవారం మధ్యాహ్నాం కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా అక్కపెల్లి రమేష్ మాట్లాడుతూ నర్సంపేట వ్యవసాయ మార్కెట్ బైపాస్ రోడ్డులో అనేక మంది రైతులు తమ మొక్కజొన్నలు ఆరబోసుకున్నారని, కుండపోత వర్షం మూలంగా మొక్కజొన్నలు వరద ప్రవాహాంలో కొట్టుకపోయాయని తెలిపారు. మరికొంత మంది రైతుల మొక్కజొన్నలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయని చెప్పారు. ఈకార్యక్రమంలో ఆపార్టీ నాయకులు కందికట్ల వీరేష్, ఇల్లందుల సాంబయ్య, గుంపెల్లి మునీశ్వర్‌లు పాల్గొన్నారు.
బతుకమ్మకు
సౌకర్యాలు కల్పించాలి
మహబూబాబాద్, సెప్టెంబర్ 23: బతుకమ్మ ఆడుకునేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమామురళీనాయక్‌కు శుక్రవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి బి.అజయ్ మాట్లాడుతూ... మానుకోట పట్టణంలో బతుకమ్మ ఆడుకోవడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొదటిరోజు బతుకమ్మ ఆడుకోవడానికి గాందీపార్కులో ఏర్పాట్లు చెయాలని కోరారు. అదేవిధంగా చివరిరోజు నిజాం చెరువుదగ్గర స్థలం తక్కువగా ఉండడంతో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు స్థలం చాలక ఇబ్బంది పడుతున్నారని నక్లెస్‌రోడ్డును బతుకమ్మరోడ్డుగా నామకరణం చేసి సౌకర్యాలు కల్పించాలని కోరారు. బారికెడ్‌లు నిర్మించడం, విద్యుత్ దీపాలను ఏర్పాటు చెయడం వంటి చర్యలు చెపడితే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. నీటిలో కలసిపోతున్న మునే్నరుజలాలను కాపాడడానికి చెక్‌డ్యాంలు నిర్మించాలని కోరారు. ఈ వినతిపత్రం ఇచ్చిన వారిలో కౌన్సిలర్లు దాస్యం రాంమూర్తి, ఎండి ఫాతిమా, పార్టీ నాయకులు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, నర్ర శ్రావణ్, మామిండ్ల సాంబలక్ష్మి, మంద శంకర్, కురాకుల పాల్, మంద శ్రీను, రమణ పాల్గొన్నారు.
బస్‌షెల్టర్‌ను ప్రారంభించిన స్పీకర్
రేగొండ, సెప్టెంబర్ 23: మండలంలోని రేపాక గ్రామంలో రూ. 2లక్షల 15వేలతో నిర్మించిన బస్‌షెల్టర్‌ను శుక్రవారం స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బస్‌షెల్టర్లు, మండల కేంద్రాలలో బస్టాండ్ నిర్మాణం చేపట్టి ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఈర్ల సదానందం, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మోడెం ఉమేష్‌గౌడ్, నాయకులు మైస బిక్షపతి, అయిలు శ్రీ్ధర్‌గౌడ్, కొలుగూరి రాజేశ్వర్‌రావు, అయిలయ్య, పట్టెం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

గూడూరులో 30 ఇళ్లు నేలమట్టం
గూడూరు, సెప్టెంబర్ 23: గూడూరు ఏజెన్సీలో కురిసిన భారీ వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో 30 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. సీతానాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్ర రంగయ్య చెరువుకు బుంగపడింది. వెంటనే రైతులు బుంగను పూడ్చారు. 142 ఎకరాల వరి పంటలో ఇసుక మేటలు వేశాయి. నాలుగు ఎకరాల అరటితోట నేలభారింది. 77 ఎకరాల పత్తి పంట దెబ్బతింది. 21 ఎకరాల మిర్చి పంట, 73 ఎకరాల మొక్కజొన్న పంటలకు నష్టం కలిగిందని తహశీల్దార్ లక్ష్మీ చెప్పారు. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి నల్లబెల్లి మండలం జలదిగ్భందంలో చిక్కుకుంది. నల్లబెల్లి మండల కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారులపై వరద నీరు ఉదృతంగా ప్రవహించడంతో ఉదయం ఆరుగంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. నారక్కపేట గ్రామానికి చెందిన మాచర్ల శైలజ, రుద్రగూడెంలో మరోక వ్యక్తి ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈదురుగాలులకు మొక్కజొన్న చేన్లు నేలబారాయి.
కొత్తగూడ : కొత్తగూడ ఏజెన్సీ మండలంలో గత మూడురోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మండలంలోని కొత్తపల్లి సమీప బూర్కపల్లి వాగువద్ద తారు రోడ్డు కొట్టుకపోయింది. పొగుళ్ళపల్లి, మొండ్రాయిగూడెం గ్రామాల మద్య కల్వర్టు రోడ్డు గొయ్యిలా మారింది. బోరింగ్ తం డాకు చెందిన దస్రు, లింగయ్యల పెంకుటిళ్ళు నేలకూలాయి. ఇటివల కాలంలో మిషన్ కాకతీయ పథకంలో మరమత్తు పనులు చేసిన వేలుబెల్లి దాచిన చెరువు గండి పడింది. మండలంలోని దుబ్బగూడెం, మామిడి గూడెం, రామారం, కర్ణగండి, కామారం, వెళ్ళేందుకు బస్సు సౌకర్యం రద్దు కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ గమ్యాలకు చేరుకున్నారు. లక్ష్మీపురం, ముస్మీ, పొగుళ్ళ పల్లి, కోనాపురం, గుండం, మైలారం, కామారం,గంగారం గ్రామాల మొక్కజొన్న, కంది, ప్రత్తి, మిరప పంటలు సాగు చేసిన రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. విధ్యుత్ నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు బిక్కుమంటూ ఉండిపోయారు.
కొట్టుకుపోయిన 100 క్వింటాళ్ల మొక్కజొన్న
నర్సంపేట, సెప్టెంబర్ 23: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ వర్షానికి 100 క్వింటాళ్ల మొక్కజొన్నలు కొట్టుకపోయాయి. జిల్లాలోనే మొక్కజొన్న పంట సాగు నర్సంపేట డివిజన్ అత్యధికంగా ఉన్న విషయం అందరికి తెల్సిందే. కాగా గత ఐదురోజుల నుండినర్సంపేట మార్కెట్ యార్డులకు వెల్లువలా మొక్కజొన్న వస్తోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు కాంటాలు జరగడం లేదు. వందల క్వింటాళ్ల మొక్కజొన్న రాశులు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్ ఆవరణ సరిపోకపోవడంతో ద్వారకపేట నుండి సర్వాపురం బైపాస్ రోడ్ వరకు రైతులు మొక్కజొన్న రాశులను కుప్పలుగా పోసుకున్నారు. దీంతో రైతులు లబోదిబోమన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే తీరా చేతికి వచ్చిన దశలో వరదనీటిలో కొట్టుకపోయిందని విలపించారు. బాధిత రైతాంగాన్ని టిఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ఉదయం పరామర్శించి ఓదర్చారు. తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసేలా కృషి చేస్తానని చెప్పారు.

మానుకోటలో ఉత్సాహంగా ఇన్‌స్పైర్
మహబూబాబాద్, సెప్టెంబర్ 23: మానుకోటలో నిర్వహిస్తున్న ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థాయి ఇన్‌స్ఫైర్ ప్రదర్శన రెండోవ రోజు ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. ఉప విద్యాధికారి తోట రవీందర్ పర్యవేక్షనలో జరిగిన ఈ ఇన్‌స్ఫైర్ కార్యక్రమాన్ని ఆర్జేడి బాలయ్య శుక్రవారం సందర్శించి విద్యార్థుల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆర్జేడి బాలయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితిసేందుకు ఇలాంటి ఇన్‌స్ఫైర్ కార్యక్రమాలు ఎంతోగానే ఉపయోగపడుతాయన్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు చిన్నారులు తమ ఆలోచనలతో పరిష్కారాలు చూపగలుగుతారని తెలిపారు. ఇక్కడ ఉన్న ప్రదర్శనలో అనేక గొప్ప అంశాలు వెలుగులోకి వచ్చాయని వాటిని మెరుగుపరిస్తే అనేక సమస్యలకు పరిష్కారం చూపగల స్థాయిలో ఉన్నాయన్నారు. ఇన్‌స్ఫైర్ కార్యక్రమా న్ని తిలకించడానికి విద్యార్థులు ఆసక్తిగా ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థుల ప్రాజెక్ట్‌లను న్యాయ నిర్ణేతలు డాక్టర్ ఎం.రాంచందర్‌రెడ్డి, డాక్టర్ పి.లక్ష్మణ్‌రావు, బి.విజయపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, శ్యాంప్రసాద్, గొపి కృష్ణ, సమ్మ య్య, దేవదాసు, రాములతోపాటు ఆహ్మదబాద్ నుండి పరిశీలకురాలిగా వచ్చిన రజనీ శర్మ ప్రాజెక్ట్‌లను పరిశీలించారు.
ఇంకుడు గుంతలపై కరపత్రం ఆవిష్కరణ...
నెల్లికుదురు మండలంలోని కాచికల్ ప్రాధమికోన్నత పాఠశాల ఉపాద్యాయ బృందం రాకేష్‌కుమా ర్, ఫణీంద్ర, సంతోష్‌లు నీటి సంరక్షణ, పొదుపు, ఇంకుడు గుంతల పట్ల అవగాహన వంటి అంశాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాన్ని ఆర్జేడి బాల య్య ఆవిష్కరించారు. భూగర్భ జలాలు పెంచు దాం-్భవిష్యత్ తరాలకు నీటిని అందిద్దాం అనే నినాదంతో రూపోందించిన ఈ కరపత్ర ఆవిష్కరణ రవీందర్, జిల్లా సైన్స్ అధికారి సిహెచ్ కేశవరావు, పిఆర్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బద్రినారాయణ, మురళీధర్‌స్వామి, ప్రవీణ్ పాల్గొన్నారు.